ఏదైనా పేరున్న సినిమాకు రీషూట్లు జరుగుతున్నాయంటే అదేదో పెద్ద అపచారం లాగా మాట్లాడేసుకుంటూ ఉంటారు ఇండస్ట్రీలో. అలా సన్నివేశాలు మళ్లీ తీస్తున్నారంటే సినిమా పోయినట్లే అని కూడా చర్చ మొదలవుతుంటుంది. మీడియాలో కూడా ఇలాగే వార్తలు వస్తుంటాయి. ఐతే ఇదే చర్చ సోగ్గాడే చిన్నినాయనా విషయంలో జరిగితే.. మీడియా వాళ్లు దాని మీద ప్రశ్నలడిగితే నాగార్జున దీటుగా బదులిచ్చాడు.
సినిమాలో ఏదైనా తేడా ఉండి కరెక్షన్లు చేసుకుంటే, మళ్లీ సన్నివేశాలు చిత్రీకరిస్తే అది సినిమాకు మంచిదే తప్ప తప్పేముంది అని ఆయన ప్రశ్నించారు. సోగ్గాడే చిన్నినాయనా సినిమా విషయంలో రీషూట్లు జరిగిన మాట వాస్తవమే అని అంగీకరించాడు. ఇప్పుడు దర్శకుడు కొరటాల శివ.. తన ఆచార్య సినిమాకు రీషూట్లు జరిగినట్లుగా వస్తున్న వార్తలపై నాగ్ తరహాలోనే మాట్లాడాడు.
ఆచార్య సినిమా అనుకున్న దాని కంటే బాగా ఆలస్యమైన సంగతి తెలిసిందే. అందుకు కరోనాను మాత్రమే కారణంగా చెప్పలేం. ఐతే రీషూట్ల వల్లేనా ఈ ఆలస్యం అని ఓ ఇంటర్వ్యూలో ఆయన్ని అడిగితే.. మా సినిమాకు రీషూట్ అన్నదే జరగలేదు. ఆ అవసరం పడలేదు. కానీ రీషూట్ అనేది ఓ తప్పుగానో, ఒక కంప్లైంట్ లాగానో మాట్లాడుతుంటారు చాలామంది. ఇది నాకు ఎప్పటికీ అర్థం కాని ప్రశ్న. ఓ సన్నివేశాన్ని ఇంత కంటే బాగా తీయొచ్చనే అభిప్రాయం దర్శకుడిలో కలిగిందంటే రీషూట్‌కు వెళ్లొచ్చు. అది మంచి విషయం కదా.
సన్నివేశం బాగా లేకపోయినా ఇది చాల్లే అని సర్దుకుపోవడం తప్పు అవుతుంది కానీ.. ప్రేక్షకుడికి ఇంకా మంచి ఫీలింగ్ తెప్పించడం కోసం రీషూట్ చేస్తే తప్పెలా అవుతుంది? నఆ వరకు రీషూట్ చేయాల్సిన అవసరం పడితే ఎంతమాత్రం సంకోచించకుండా నిర్మాతను ఒప్పించి ఆ సన్నివేశం మ
This post was last modified on April 18, 2022 8:47 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…