Movie News

సుమ‌కు నేను ఫ్యాన్-ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

సినిమా వేడుక‌ల్లో చాలా సీరియ‌స్‌గా క‌నిపిస్తాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. త‌న సినిమా వేడుక‌ల్లో కూడా ఆయ‌న మాట్లాడ్డం చాలా త‌క్కువ‌. వేరే వాళ్ల సినిమా వేడుక‌ల‌కు, ఇంకేవైనా ప్రమోష‌న‌ల్ ఈవెంట్ల‌కు అస‌లే రాడు. త‌న ఫ్యామిలీ హీరోలకు సంబంధించిన ఈవెంట్ల‌లో కూడా ఎప్పుడో కానీ పాల్గొన‌డు.

అలాంటివాడు యాంక‌ర్ సుమ ప్ర‌ధాన పాత్ర పోషించిన జ‌య‌మ్మ పంచాయితీ సినిమాకు సంబంధించి ఒక ఈవెంట్లో పాల్గొని త‌న చేతుల మీదుగా ట్రైల‌ర్ లాంచ్ చేయ‌డం విశేషం. అంతే కాక ఈ వేడుక‌లో చాలా స‌ర‌దాగా మాట్లాడాడు కూడా. సుమ గురించి ఆయ‌న మాట్లాడిన మాట‌లు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. సుమ‌కు తాను అభిమానిన‌ని ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా చెప్ప‌డం విశేషం.

సుమకు చాలామంది అభిమానులున్నార‌ని, వారిలో తానూ ఒక‌డిన‌ని ప‌వ‌న్ అన్నాడు. ఆమెలో మంచి న‌టి దాగి ఉంద‌ని, కేవ‌లం యాంక‌రింగ్‌కే ప‌రిమితం కాకుండా, అప్పుడ‌ప్పుడూ ఇలా సినిమాల్లో కూడా న‌టిస్తూ ఉండాల‌ని ప‌వ‌న్ కోరాడు. సుమ‌తో క‌లిసి న‌టించాల‌ని కూడా కోరుకుంటున్న‌ట్లు ప‌వ‌న్ చెప్ప‌డం విశేషం.

సుమకు ఇష్ట‌మైతే తాను త‌న సినిమాల నిర్మాత‌ల‌తో మాట్లాడ‌తాన‌ని.. ఆమె ఎలాంటి పాత్ర‌లు చేయాల‌నుకుంటోందో చెబితే అలా ఉండేలా త‌న కోసం క్యారెక్ట‌ర్లు సిద్ధం చేయిస్తామ‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించాడు. దీనికి సుమ ఒకింత సంబ‌ర‌ప‌డుతూ.. వెంట‌నే నిర్మాత‌లు ఎక్క‌డ అని న‌వ్వుతూ అడిగింది.

దీంతో ప‌వ‌న్ స‌హా అంద‌రూ గ‌ట్టిగా న‌వ్వేశారు. ఇక ప‌వన్ చేతుల మీదుగా లాంచ్ అయిన జ‌య‌మ్మ పంచాయితీ ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకుంటోంది. సుమ కామెడీ టైమింగ్‌కు త‌గ్గ క‌థ‌నే ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్ ఎంచుకున్న‌ట్లున్నాడు. చాలా వ‌ర‌కు స‌ర‌దాగా సాగుతూ.. కొంత‌మేర ఎమోష‌న‌ల్‌గా కూడా క‌దిలించే సినిమాలా క‌నిపిస్తున్న జ‌య‌మ్మ పంచాయితీ మే 6న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

This post was last modified on April 17, 2022 11:29 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

24 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

1 hour ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

1 hour ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

1 hour ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago