మామూలుగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లను వేర్వేరుగా మంచి డ్యాన్స్ నంబర్లో చూడడమే అభిమానులకు ఒక పండుగ లాంటిది. చిరంజీవి ఎంత గొప్ప డ్యాన్సరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో ఆయన్ని మించిన డ్యాన్స్ లేడు అంటే అతిశయోక్తి కాదు.
ఆయన కన్నా స్పీడ్‌గా డ్యాన్స్ చేసేవాళ్లు ఉండొచ్చు కానీ.. ఆయన డ్యాన్స్‌లో ఉన్న గ్రేస్, అందం ఇంకెవరిలోనూ చూడలేం అనడంలో మరో మాట లేదు. ఇక చిరు వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ చరణ్ సైతం మేటి డ్యాన్సర్లలో ఒకడిగా పేరు సంపాదించాడు.
ఇటీవలే ఆర్ఆర్ఆర్‌లో నాటు నాటు పాటలో తారక్‌తో కలిసి చరణ్ ఎలా చెలరేగిపోయాడో తెలిసిందే. అలాంటిది మెగా స్టార్, మెగా పవర్ స్టార్ కలిసి ఒక మంచి డ్యాన్స్ నంబర్లో స్టెప్పులేస్తే ఎలా ఉంటుందనే ఊహే మెగా అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తుంది. ఈ ఊహ నిజం కాబోతోంది.
చిరు, చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్యలో వీరి మధ్య మంచి ఊపున్న పాటను చూడబోతున్నాం. ఈ విషయాన్ని ఒక వీడియో ద్వారా వెల్లడించారు. అందులో చిరు, చరణ్, దర్శకుడు కొరటాల కనిపించారు. చరణ్‌తో డ్యాన్స్ గురించి చిరు కంగారు పడటం.. ఆ తర్వాత నన్ను డామినేట్ చేస్తావా అని చరణ్‌ను అడగడం.. డామినేట్ చేయను కానీ తగ్గనంటూ చరణ్ పేర్కొనడం.. ఈ సంభాషణ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. ముందే ఇలాంటి ప్రోమో వదిలి అభిమానులు ఊరించారంటే.. చిరు, చరణ్ ఈ పాటలో మామూలుగా స్టెప్పులేసి ఉండరని,
తండ్రీ తనయులను కలిసి ఒక పాటలో చూడటం కనువిందే అని ఫ్యాన్స్ ఊహల్లో తేలియాడుతున్నారు. ఈ పాటకు థియేటర్లు హోరెత్తిపోవడం ఖాయమని, ఈ నెల 29న అభిమానుల సందడికి అవి తట్టుకోవడం కూడా కష్టమే అని అభిప్రాయపడుతున్నారు సోషల్ మీడియా జనాలు.
Gulte Telugu Telugu Political and Movie News Updates