తమిళనాట విచిత్రమైన పరిస్థితి నెలకొంది ఈ వీకెండ్. అక్కడ బిగ్గెస్ట్ స్టార్ అయిన విజయ్ బీస్ట్ అనే కొత్త సినిమాతో ఈ బుధవారం ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఐతే విజయ్ గత సినిమాల మాదిరి ఇదేమీ మ్యాజిక్ చేయలేదు. డివైడ్ టాక్‌ను తట్టుకోలేకపోతోంది. తొలి రోజు వరకు వసూళ్ల మోత మోగించినా.. రెండో రోజు నుంచి సినిమాకు అనుకున్నంత స్థాయిలో ఆదరణ లేదు.
అక్కడి ప్రేక్షకులు కేజీఎఫ్-2 చూడటానికి తహతహలాడుతున్నారు. విజయ్ సినిమా ముందు ఈ చిత్రం నిలవలేదని అనుకున్నారు కానీ.. అక్కడ కేజీఎఫ్-2 కోసం డిమాండ్ మామూలుగా లేదు. కానీ ఆల్రెడీ బీస్ట్ కోసం మెజారిటీ థియేటర్లు రాసిచ్చేశారు. కేజీఎఫ్-2కు పరిమిత సంఖ్యలోనే స్క్రీన్లు, షోలు ఇచ్చారు. కానీ ఆ సినిమా టికెట్లకు డిమాండ్ విపరీతంగా ఉండగా.. అందుకు తగ్గట్లుగా థియేటర్లు, షోల సప్లై లేదు.
విజయ్ సినిమాకు ఆక్యుపెన్సీ పడిపోయినా.. కేజీఎఫ్-2కు స్క్రీన్లు, షోలు పెంచట్లేదు. విజయ్ సినిమాను తీసేస్తే అభిమానులు ఊరుకోరనో.. ముందే జరిగిన అగ్రిమెంట్లను మీరలేమనో.. ఇలా కారణాలేవైనా సరే.. ఇప్పుడు కేజీఎఫ్-2 చూడాలనుకుంటున్న తమిళ ప్రేక్షకులందరి ఆశా తీరట్లేదు.
దీంతో కేజీఎఫ్-2 ఆడుతున్న థియేటర్లలో రాత్రి 12 తర్వాత ఉదయం 6 మధ్య కూడా ఒకట్రెండు షోలు నడిపించేస్తుండటం విశేషం. మామూలుగా కొత్త సినిమాలకు తొలి రోజు మాత్రమే తెల్లవారుజామున షోలు ఉంటాయి. కానీ కేజీఎఫ్-2కు చిత్రంగా విడుదలైన మూడో రోజు తెల్లవారుజామున 2.30-3.30 మధ్య షోలు కేటాయించడం విశేషం.
తమిళనాడులో 24 గంటల పాటు ఆరు షోలు నడిపించుకోవడానికి అనుమతులుండటంతో కేజీఎఫ్-2 డిమాండ్‌ను తట్టుకోవడానికి అక్కడి ఎగ్జిబిటర్లు ఇలా ప్లాన్ చేస్తున్నారు. ఏ టైంలో అయినా సరే.. కేజీఎఫ్-2 టికెట్లు ఇలా పెడితే అలా అమ్ముడైపోతున్నాయి. షోలకు షోలు సోల్డ్ ఔట్ అయిపోతున్నాయి. అదే సమయంలో బీస్ట్‌కు అంతగా డిమాండ్ కనిపించడం లేదని సోషల్ మీడియాలో ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది.
This post was last modified on April 16, 2022 8:02 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…