యశ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్న పేరిది. కేజీఎఫ్-2 సినిమాతో అతను రేపుతున్న సంచలనం అంతా ఇంతా కాదు. కేజీఎఫ్-చాప్టర్1తోనే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ఈ కన్నడ హీరో.. చాప్టర్-2తో పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్ అయిపోయాడనే చెప్పాలి. కేజీఎఫ్‌కు ముందు సినిమాతో పోలిస్తే అతడి మార్కెట్ పది రెట్ల కన్నా ఎక్కువైందంటే అతిశయోక్తి కాదు.
మన ప్రభాస్ తరహాలోనే అతడి ఇమేజ్ అసాధారణంగా పెరిగిపోయింది. ఇప్పుడీ స్థాయిలో ఉన్న యశ్.. అసలు ఏ ఫిలిం బ్యాగ్రౌండ్ లేకుండా కన్నడ ఇండస్ట్రీలోకి రావడం విశేషం. అలాగని అతనేమీ బాగా డబ్బున్న కుటుంబం నుంచి రాలేదు. ఒక సాధారణ బస్ డ్రైవర్ కొడుకు యశ్. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి చాలామంది కుర్రాళ్ల లాగే సినిమా కలలు కన్న అతణ్ని చూసి చాలామంది నవ్వుకున్నారట. హీరో అవుతానంటే ఎగతాళి చేశారట.
అయినా సరే.. తన కలను చంపుకోలేదు. సినీ రంగంలోకి వచ్చాడు. అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగాడు. ముందు చిన్న సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశాడు. తర్వాత రాకీ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అది సరిగా ఆడకపోయినా నిరాశ చెందలేదు. ప్రయత్నం మానలేదు. తర్వాతి సినిమాలు అతడికి ఓ మోస్తరుగా గుర్తింపు తెచ్చాయి. మిస్టర్ అండ్ మిసెస్ రామాచారితో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు యశ్. ఆ తర్వాత గజకేసరి అనే సినిమా కూడా బాగానే ఆడింది. అప్పుడే అతను ఉగ్రం సినిమాతో వెలుగులోకి వచ్చిన ప్రశాంత్ నీల్‌తో జట్టు కట్టాడు.
ఐదేళ్ల కిందట వీళ్లిద్దరూ కలిసి హోంబలె ఫిలిమ్స్ అండతో మొదలుపెట్టిన ప్రయత్నం ఇప్పుడు దేశంలోనే బిగ్గెస్ట్ ఫిలిమ్స్‌లో ఒకటిగా మారిన కేజీఎఫ్-2గా రూపాంతంరం చెందింది. ఇకపై యశ్ నటించే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్లోనే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి చేరుకోవడం అసాధారణ విషయమే.
This post was last modified on April 16, 2022 7:56 am
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…