వందలు వేల కోట్ల పెట్టుబడి ఉంటే తప్ప ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పెట్టడం సాధ్యం కాదనుకుంటున్న సమయంలో.. కేవలం తెలుగు వరకు ప్రత్యేకంగా తక్కువ పెట్టుబడితో ఓటీటీ పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు అల్లు అరవింద్.
ఐతే గీతా ఆర్ట్స్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రాలు, ఇంకేవో కొన్ని చిన్న సినిమాలు పెట్టుకుని ఓటీటీని నడిపి సక్సెస్ కావడం సాధ్యమా అని సందేహించిన వారికి ఆయన దీటైన సమాధానమే ఇచ్చారు. కరోనా టైంలో నెమ్మదిగా కంటెంట్ పెంచుతూ, తెలివిగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను దించుతూ ఆహాను భలేగా జనాల్లోకి తీసుకెళ్లారు.
ఇప్పుడు పెద్ద పెద్ద స్ట్రీమింగ్ జెయింట్స్‌కు దీటుగా నిలబడే స్థితికి చేరుకుంది ఆహా. తెలుగు వరకు ఇప్పుడు టాప్ ఓటీటీల్లో ఆహా ఒకటి. ఈ ఊపులో ఇక తమిళం మీద కన్నేశారు అల్లు వారు. ఆహాను తమిళంలో కూడా లాంచ్ చేయడానికి కొంత కాలంగా సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
లాంచింగ్‌కు ముందే ఆహాను ప్రమోట్ చేసిన తీరు తమిళులను ఆకట్టుకుంది. ఇక ఆరంభోత్సవ వేడుక మామూలుగా చేయలేదు అల్లు వారు. ఏకంగా తమిళనాడు సీఎం స్టాలిన్‌నే ముఖ్య అతిథిగా తీసుకురాగలిగారు. అలాగే భారతీరాజా లాంటి దిగ్గజాన్ని కూడా రప్పించారు. మరోవైపు స్టార్ హీరో శింబు, మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌లను బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకున్నారు. ఆరంభ వేడుకలో ఆ ఇద్దరూ కూడా పాల్గొన్నారు.
మొత్తంగా లాంచింగ్ పార్టీని చాలా గ్రాండ్‌గా నిర్వహించి ఆహా ఓటీటీని తమిళంలో హాట్ టాపిక్‌గా మార్చారు అరవింద్. ఇక కంటెంట్ పరంగా కూడా ఆహా తక్కువగా ఏమీ కనిపించడం లేదు. పేరున్న సినిమాలను కొన్నారు. కొన్ని ఒరిజినల్స్ రెడీ చేశారు. తెలుగు ఆహాతో పోలిస్తే కాస్త ఎక్కువ కంటెంట్‌తోనే రంగంలోకి దిగుతున్నారు. తెలుగులో మాదిరే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే తమిళంలోనూ ఆహా అదరగొట్టడం ఖాయం.
This post was last modified on April 16, 2022 7:53 am
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో ఎక్కువ ఎడ్జ్ ఉన్నది మెకానిక్ రాకీకే. విశ్వక్ సేన్ హీరోగా మీనాక్షి చౌదరి,…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సుకుమార్ ఏదో…
నిన్న జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకవేళ హైదరాబాద్ అయ్యుంటే ఎలా ఉండేదో కానీ పాట్నాలో వచ్చిన…
హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీలులకు సైతం గౌరవం ఎక్కువ.…
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో గడ్డం,…
దర్శక ధీరుడు రాజమౌళి మొదటి నుంచి ఒక సెట్ ఆఫ్ టెక్నీషియన్లతో పని చేస్తూ వచ్చాడు. ఆయన సినిమాలకు ఇప్పటిదాకా…