Movie News

యశ్‌కే ఇలా ఉంటే.. ఇక ప్రభాస్‌కు?

మూడున్నరేళ్ల ముందు వరకు యశ్ అంటే కర్ణాటక వరకే హీరో. అక్కడతడికి స్టార్ ఇమేజ్ ఉంది. కన్నడలో అతడికి అప్పటికే కొన్ని డీసెంట్ హిట్లున్నాయి. అలా అని శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్, సుదీప్‌, ఉపేంద్రల స్థాయి అయితే కాదు.

అలాంటి హీరోను పెట్టి ఒక సినిమా అనుభవం ఉన్న ప్రశాంత్ నీల్ అనే దర్శకుడు ‘కేజీఎఫ్’ అనే సినిమా తీస్తే.. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఉద్వేగంతో ఊగిపోయారు. హీరో ఎలివేషన్లకు గూస్ బంప్స్ వచ్చేశాయి అందరికీ. మనకు పరిచయం లేని హీరో సినిమాలో ఎలివేషన్లకు అంతలా ఊగిపోవడం ఇంతకుముందెన్నడూ జరగలేదంటే అతిశయోక్తి కాదు.

హీరో ఎలివేషన్ల వరకు చూస్తే రాజమౌళి సహా అందరు దర్శకులనూ ప్రశాంత్ నీల్ దాటిపోయాడు అనడంలో సందేహం లేదు. ‘కేజీఎఫ్’ చూసి ఊగిపోయి.. ‘కేజీఎఫ్-2’ కోసం ఉత్కంఠగా చూసిన ప్రేక్షకులను ఇప్పుడు మరింతగా అలరిస్తున్నాడు ప్రశాంత్. కథాకథనాలు బలహీనమే అయినా.. హీరో ఎలివేషన్లలో మాత్రం ఇది ‘కేజీఎఫ్-1’కు తీసిపోయే చిత్రం కాదు.

‘కేజీఎఫ్-చాప్టర్ 1’ చూసినపుడే చాలామంది తెలుగు హీరోల అభిమానులకు.. ఇలాంటి సినిమా తమ హీరోకు పడి ఉంటే అన్న ఆలోచన కలిగింది. ముఖ్యంగా ప్రభాస్ లాంటి కటౌట్‌కు ఇలాంటి సినిమా పడితే ఇంకేమైనా ఉందా అన్న ఊహలోకి చాలామంది వెళ్లారు. ప్రభాస్-ప్రశాంత్ కాంబినేషన్ కోసం చాలామంది కోరుకున్నారు.

ఈ కాంబో సెట్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు. వీరి కలయికలో ‘సలార్’ అనే సినిమా మొదలైంది. దీని ఫస్ట్ లుక్, ఆ తర్వాత లీక్ అయిన ఆన్ లొకేషన్ పిక్స్ చూశాక ప్రభాస్ అభిమానుల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ఇప్పుడిక ‘కేజీఎఫ్-2’లో హీరో ఎలివేషన్లు చూశాక.. అందరూ ‘సలార్’ గురించే ఆలోచిస్తున్నారు.

ఇలాంటి ఎలివేషన్లే ‘సలార్’లో పడితే ఇండియాలోనే బిగ్గెస్ట్ హీరోగా అవతరించిన ప్రభాస్ స్క్రీన్లను తగలెట్టేస్తాడు కదా అనుకుంటున్నారు. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన ప్రభాస్ రెండు చిత్రాలు అతడి ఇమేజ్‌కు సరిపోలేదు.

సుజీత్, రాధాకృష్ణకుమార్.. ప్రభాస్ మాస్ ఇమేజ్‌ను వాడుకోలేకపోయారు. మనకు పరిచయం లేని యశ్‌తోనే హీరో ఎలివేషన్లతో గూస్ బంప్స్ తెప్పించిన ప్రశాంత్.. ఇదే స్థాయిలో ‘సలార్’లో ప్రభాస్‌ను చూపిస్తే మాత్రం ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ మాస్ ఫిలింగా అది నిలిచిపోవడం ఖాయం.

This post was last modified on April 15, 2022 5:50 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

1 hour ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

2 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

2 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

3 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

3 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

4 hours ago