భారీ అంచనాలతో రిలీజైన ఒక పెద్ద హీరో సినిమా అభిమానుల్ని అలరించేలా ఉంటే.. ఆ హీరో పెర్ఫామెన్స్ గురించి కొనియాడుతూ.. set screens on fire అనే మాట వాడుతుంటారు నెటిజన్లు. ఐతే ఎలివేషన్ కోసం వాడే ఈ మాటను నిజం చేశారు తమిళ స్టార్ విజయ్ అభిమానులు. విజయ్ కొత్త చిత్రం బీస్ట్ రిలీజ్ సందర్భంగా తమిళనాట ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
ఏ ప్రాంతంలో, ఏ థియేటర్లో జరిగిందన్న వివరాలు వెల్లడి కాలేదు కానీ.. తమిళనాడులోనే జరిగినట్లుగా భావిస్తున్న ఈ ఉదంతం ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారింది. బీస్ట్ మూవీ అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో అసంతృప్తికి లోనైన విజయ్ అభిమానులు స్క్రీన్‌కు నిప్పు పెట్టేశారు. ముందు అది సినిమాలోని మంటే అనుకున్నారు కానీ.. కొన్ని క్షణాల తర్వాత కానీ.. అది నిజం మంట అని జనాలకు అర్థం కాలేదు. సినిమా చివరి దశలో ఉండగా.. స్క్రీన్‌ను ఇలా తగలబెట్టేశారు. థియేటర్లో ఉన్న వాళ్లు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మంట పెరుగుతుండగా.. జనాలు ఆందోళనతో అరవడం, థియేటర్ నుంచి బయటికి పరుగులు పెట్టడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఐతే తర్వాత ఏం జరిగిందన్న వివరాలు తెలియరాలేదు. బీస్ట్ సినిమా ప్రేక్షకులను ఎంత నిరుత్సాహానికి గురి చేసిందనడానికి ఇది రుజువంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
విజయ్ అభిమానులకు తప్పితే ఎవరికీ ఓ మోస్తరుగా కూడా నచ్చేలా తీర్చిదిద్దలేదు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. విజయ్ ఫ్యాన్స్ సైతం సినిమా పట్ల అసంతృప్తితో మాట్లాడుతున్న వీడియోలు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. డిజాస్టర్ బీస్ట్ అన్న హ్యాష్ ట్యాగ్ బుధవారం సాయంత్రం నుంచి ట్విట్టర్లో టాప్‌లో ట్రెండ్ అవుతుండటం గమనార్హం.
This post was last modified on April 14, 2022 7:56 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…