బాహుబలి-2 తర్వాత భారతీయ ప్రేక్షకులంతా ఆ స్థాయి అంచనాలతో ఎదురు చూస్తున్న సినిమా అంటే.. కేజీఎఫ్-2నే. మూడేళ్లకు పైగా నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మధ్యలో సినిమాకు హైప్ కొంచెం తగ్గినట్లు అనిపించింది కానీ.. రిలీజ్ సమయానికి కథ మొత్తం మారిపోయింది. దేశం మొత్తం ఇప్పుడు కేజీఎఫ్-2 మేనియానే నడుస్తోంది.
విదేశాల్లో సైతం ఈ చిత్రం ప్రభంజనం సృష్టించేలాగే కనిపిస్తున్నాయి. కేజీఎఫ్-2 స్థాయి ఏంటన్నది ఈ సినిమా రిలీజవుతున్న స్క్రీన్ల సంఖ్య చూస్తేనే అర్థమైపోతుంది. ప్రపంచవ్యాప్తంగా పది వేలకు పైగా స్క్రీన్లలో రాకీ బాయ్ రచ్చ చేయబోతుండటం విశేషం. దక్షిణాదిన వివిధ భాషల్లో కలిపి మొత్తం 2600కు స్క్రీన్లలో రిలీజవుతోంది కేజీఎఫ్-2. కన్నడ కంటే కూడా తెలుగులోనే ఈ చిత్రం ఎక్కువ థియేటర్లలో విడుదలవుతుండటం విశేషం.
దక్షిణాదిన మిగతా రాష్ట్రాలన్నింట్లో ఉన్నన్ని థియేటర్లు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండటం గమనార్హం. తెలుగులో మాత్రమే కేజీఎఫ్-2 వెయ్యికి పైగా స్క్రీన్లలో రిలీజవుతోంది. ఉత్తరాదిన కేజీఎఫ్-2కున్న డిమాండ్ దృష్ట్యా హిందీలో ఈ చిత్రానికి 4 వేలకు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తుండడం విశేషం. ఇక విదేశాల్లో దాదాపు నాలుగు వేల థియేటర్లలో కేజీఎఫ్-2ను ప్రదర్శించబోతున్నారు.
ఇందులో సౌత్ వెర్షన్లకు 3 వేల దాకా స్క్రీన్లు కేటాయించగా.. హిందీ వెర్షన్ వెయ్యికి పైగానే థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. వరల్డ్ వైడ్ ఈ చిత్రానికి అదిరిపోయే రేంజిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఒక్క హిందీ వెర్షన్ మాత్రమే ఇండియాలో తొలి రోజు రూ.50 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో కలిపితే తొలి రోజు వసూళ్లు రూ.150 కోట్ల మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదేమో.
This post was last modified on April 14, 2022 7:51 am
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…