గతంలో మాదిరిగా ఒక మనిషిని నేరస్తుడిగా తీర్మానించే హక్కు కేవలం కోర్టులకు లేదిప్పుడు. సోషల్ మీడియానే ఎవరు నిందితుడు, ఏ సమస్యకు ఎవరు బాధ్యుడు అని తీర్పు ఇచ్చేస్తోంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడనేది ఎవరికీ తెలియదు. అతను కారణం చెప్పి చనిపోలేదు. కానీ అతని చావుకి సోషల్ మీడియా ఇప్పటికే చాలా మందిని నిందితులుగా నిలబెట్టింది.
అందరికంటే ఎక్కువగా సినిమావాళ్ళ వారసులను ప్రోత్సహించి, నెపోటిజంకి బ్రాండ్ అంబాసడర్ అనిపించుకున్న కరణ్ జోహార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మాములుగా ఇలాంటి వాటిని దులిపేసుకునే కరణ్ ఈసారి పెల్లుబికిన ఆగ్రహంతో సైలెంట్ గా ఉంటున్నాడు. ఇప్పుడు తానూ ఏ కారణంతో వచ్చినా కానీ తిట్టిపోస్తారని అతనికి తెలుసు. అందుకే ఈ వేడి చల్లారే వరకు సైలెంట్ అయిపోయాడు. అయితే అతను సైలెంట్ అవడం శ్రీదేవి కూతురు జాన్వీకి ఇబ్బందిగా మారింది.
ఆమె నటించిన గుంజన్ సక్సేనా చిత్రాన్ని కరణ్ నిర్మించాడు. అది డైరెక్ట్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది. సరిగ్గా దాని ప్రమోషన్ మొదలయ్యే సమయానికి సుషాంత్ సూసైడ్ న్యూస్ రావడంతో కరణ్ మీడియాకు దూరంగా ఉండాల్సి వస్తోంది. థియేటర్లలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం తప్పనిసరి పరిస్థితులలో డిజిటల్ రిలీజ్ కి వెళితే ఇక్కడ కూడా సరైన పబ్లిసిటీ చేసుకోలేని పరిస్థితి తలెత్తింది పాపం.
Gulte Telugu Telugu Political and Movie News Updates