మెగా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ వచ్చిన ఆచార్య ట్రైలర్ రానే వచ్చింది. మంగళవారం సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించడం విశేషం. ఆ తర్వాత కాసేపటికే సోషల్ మీడియాలోకి కూడా వచ్చేసింది ట్రైలర్. అభిమానుల అంచనాలకు తగ్గట్లే మాస్, యాక్షన్, ఎమోషన్లు కలబోసిన విధంగా ట్రైలర్ ఉండటంతో వారి కడుపు నిండిపోయింది.
ఐతే ట్రైలర్లో ఓ విషయం అందరినీ ఆశ్చర్యపరిచి.. డిస్కషన్ పాయింట్‌గా మారింది. అసలిది చిరు సినిమానా చరణ్ సినిమానా.. ఇందులో గెస్ట్ రోల్ చేసింది రామ్ చరణా చిరంజీవా అన్నదే ఆ విషయం. సినిమా ఏ ఆర్డర్లో ఉంటుందో అలాగే ట్రైలర్ కూడా కట్ చేసినట్లుగా కనిపించింది. ఐతే కథ మొదలైంది చరణ్ చేసిన సిద్ధ పాత్రతోనే. అతడి పాత్ర ముగింపుతోనే కథలో మలుపు వచ్చేలా కనిపించింది. విలన్ సిద్ధ పాత్రకు తెరదించితే.. ఆ తర్వాత ఆచార్యగా చిరు రంగప్రవేశం చేసి సిద్ధు లక్ష్యాన్ని నెరవేర్చడం, ఈ క్రమంలో మధ్యలో వాళ్లిద్దరి మధ్య ఫ్లాష్ బ్యాక్ రావడం.. ఇలా కథ సాగుతుందనిపించింది.
ట్రైలర్ వరకు చూస్తే చరణ్ సినిమాలో చిరు గెస్ట్ రోల్ చేసిన ఫీలింగే కలిగింది తప్ప.. చిరు సినిమాలో చరణ్ అతిథి పాత్ర చేసినట్లుగా అనిపించలేదు. ఇది మెగా అభిమానులకు మిశ్రమానుభూతి కలిగించింది. దీనిపై భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. చరణ్ ఇప్పుడున్న ఫాంలో ఎక్కువ స్క్రీన్ స్పేస్‌తో కనిపిస్తే మెగా అభిమానులకు సంతోషమే కానీ.. అదే సమయంలో చిరు డౌన్ అయిపోతాడేమో, ఆయన పాత్రకు ప్రాధాన్యం తగ్గిపోతుందేమో అన్న అనుమానాలు వారిలో కలిగాయి. మరి ఈ సందేహాలకు కొరటాల శివ ఎలా బదులిస్తాడో చూడాలి మరి.
This post was last modified on April 13, 2022 6:35 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…