‘కేజీఎఫ్’ సినిమాతో దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒకడైపోయాడు ప్రశాంత్ నీల్. వేరే భాషల ప్రేక్షకులకు అసలు పరిచయం లేని యశ్‌ను హీరోగా పెట్టి ఈ సినిమా తీసి.. ఆయా భాషల్లో ఒక సూపర్ స్టార్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించడం, గూస్ బంప్స్ తెప్పించడం, మాస్ ప్రేక్షకులు ఊగిపోయేలా చేయడం అంటే మామూలు విషయం కాదు. హీరో ఎలివేషన్లను ఇంతకంటే పీక్స్‌లో చూపించడం ఇంకెవరికీ సాధ్యం కాదేమో అన్న ఫీలింగ్ కలిగింది ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు.
ఐతే ఈ ఎలివేషన్లన్నీ టాలీవుడ్ నుంచి నేర్చుకున్నవే అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ఇదేమీ తెలుగులో ఏదైనా మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇక్కడి వాళ్ల మెచ్చుకోలు కోసం చెప్పిన మాట కాదు. ఓ కన్నడ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో కన్నడలో మాట్లాడుతూ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రశాంత్. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాల నుంచి తాను ఎక్కువ ఇన్‌స్పైర్ అయినట్లు అతను వెల్లడించాడు.
తనపై తెలుగు సినిమాల ప్రభావం గురించి అతను వివరిస్తూ.. ‘‘నేను 90ల్లో తెలుగు సినిమాలు విపరీతంగా చూశాను. హీరో ఎలివేషన్లను అక్కడ చూపించినట్లు ఇంకెక్కడా చూపించరన్నది నా ఉద్దేశం. కమర్షియల్ సినిమాలను చాలా బాగా తీర్చిదిద్దుతారు. ముఖ్యంగా చిరంజీవి గారికి నేను పెద్ద ఫ్యాన్. 90ల్లో ఆయన సినిమాలు చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. ఇప్పుడు నేను తీస్తున్న సినిమాలకు స్ఫూర్తి అవే. నాకు తమిళం రాదు. తమిళ సినిమాల చూడలేదు. అవి చూస్తే వాటి నుంచి కూడా ఇన్‌స్పైర్ అయ్యేవాడినేమో. కన్నడ సినిమాలు కూడా కొంత ఇన్‌స్పైర్ చేసేవి కానీ.. అవి ఎక్కువగా తెలుగు నుంచి వచ్చిన రీమేక్‌లే’’ అని ఓపెన్‌గా మాట్లాడేశాడు ప్రశాంత్.
‘కేజీఎఫ్’ తర్వాత కన్నడ హీరోలను పక్కన పెట్టి టాలీవుడ్ సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తుండటం పట్ల ఇప్పటికే ప్రశాంత్ కన్నడిగుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పట్నుంచో ట్రోల్స్ నడుస్తున్నాయి. అయినా సరే.. తనకు టాలీవుడ్ స్ఫూర్తి అని అతను స్టేట్మెంట్ ఇవ్వడం విశేషమే.
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…