అర్జున్ రెడ్డి.. తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమాకో ప్రత్యేక అధ్యాయం కేటాయించాల్సిందే. ఇదొక మోడర్న్ క్లాసిక్, ట్రెండ్ సెట్టర్ అనడంలో సందేహం లేదు. ఇందులోని బోల్డ్‌నెస్‌ను ఓ వర్గం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోవచ్చు కానీ.. కథాకథనాలు, నరేషన్ విషయంలో ఈ చిత్రంతో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అది ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసి సెన్సేషనల్ హిట్టయిపోయింది అర్జున్ రెడ్డి.
ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ పెద్ద స్టార్ అయిపోయాడు. ఈ చిత్రంలో విజయ్ పెర్ఫామెన్స్, సందీప్ దర్శకత్వ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాను అనుకరిస్తూ తర్వాత ఎన్నో చిత్రాలు వచ్చాయి కానీ.. ఏదీ దాని స్థాయిని అందుకోలేకపోయింది. అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేస్తే అక్కడా సెన్సేషనల్ హిట్టయింది.
ఈ ఏడాది ఆగస్టు 25కు అర్జున్ రెడ్డి రిలీజై ఐదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా అర్జున్ రెడ్డి రా వెర్షన్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ సినిమాను ముందు 4 గంటల 20 నిమిషాల నిడివితో తీశాడు సందీప్. తర్వాత దాన్ని 3 గంటల 45 నిమిషాలకు కుదించాడు. కానీ ఈ లెంగ్త్ కూడా చాలా ఎక్కువ అవుతుందని భావించి చివరికి 3 గంటల రన్ టైంతో రిలీజ్ చేశారు. మామూలుగా ఇప్పుడు సినిమాల నిడివి రెండున్నర గంటలకు అటు ఇటు ఉంటోంది. 3 గంటలకే లెంగ్త్ ఎక్కువ అంటారు. అలాంటిది 3 గంటల 45 నిమిషాల రన్ టైం అంటే కష్టమే. అందుకే దాన్ని కుదించాల్సి వచ్చింది.
ఐతే సినిమాను 3.45 గంటల నిడివితో రిలీజ్ చేసి ఉంటే ఇంకా పెద్ద హిట్టయ్యేదని, అర్జున్ రెడ్డి పాత్ర ఇంకా ఇంపాక్ట్ చూపించేదని, అందుకే ఇప్పుడు ఈ సినిమా రా వెర్షన్‌ను ఐదో వార్షికోత్సవ సందర్భాన రిలీజ్ చేయబోతున్నానని సందీప్ ప్రకటించాడు. అర్జున్ రెడ్డి కాలేజీలో అడుగు పెట్టడానికి ముందు జీవితాన్ని, ఇంకా కొన్ని అదనపు సన్నివేశాలను చూడొచ్చట ఇందులో. మరి ఏ ఫ్లాట్ ఫాం ద్వారా రా వెర్షన్ రిలీజవుతుందో సందీప్ ఇంకా చెప్పలేదు.
This post was last modified on April 11, 2022 8:32 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…