సినిమా వేడుకలు, ప్రెస్ మీట్లు చాలా వరకు అనుకున్న సమయానికి మొదలు కావు. చెప్పిన టైంకి అతిథులు వచ్చేస్తే వాళ్ల విలువ తగ్గిపోతుందని అనుకుంటారో.. లేక ప్లానింగ్ లోపమో.. లేక ఇంకేవైనా ఇబ్బందులు తలెత్తుతాయో కానీ.. ఆలస్యం షరా మామూలే అన్నట్లు ఉంటుంది. ఐతే ప్రెస్ మీట్లలో మన మీడియాను మన హీరోలు కలిసేటపుడు ఆలస్యం జరిగితే అంతా సర్దుకుంటారు కానీ.. ఒక పరభాషా కథానాయకుడు ప్రెస్ మీట్‌కు ఒక టైం చెప్పి గంటా రెండు గంటలు ఆలస్యంగా వస్తే మీడియా వాళ్లకు ఆగ్రహం రాక ఎలా ఉంటుంది. ఇప్పుడు విశాఖపట్నంలో ఇదే జరిగింది.
‘కేజీఎఫ్-చాప్టర్ 2’ ప్రమోషన్ల కోసం నిన్నట్నుంచి రెండు తెలుగు గడ్డపై తిరుగుతున్నాడు యశ్. నిన్న ఆల్రెడీ తిరుమల దర్శనం, ఆ తర్వాత ప్రెస్ మీట్ జరిగాయి. సోమవారం విశాఖపట్నం, హైదరాబాద్‌లలో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేశారు. ఐతే వైజాగ్‌లో ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ అని చెప్పి.. 12.30కి మొదలుపెట్టారు. గంటన్నర పాటు యశ్ అండ్ టీం కోసం ఎదురు చూడటంతో మీడియా వాళ్లకు కోపం కట్టలు తెంచుకుంది. దీనిపై ఒక విలేకరి యశ్‌ను నేరుగా ప్రెస్ మీట్లో నిలదీశాడు. గంటన్నర ఆలస్యంగా వస్తే ఎలా అని ప్రశ్నించాడు. దీనికి యశ్ వినమ్రంగా బదులిచ్చాడు.
ప్రెస్ మీట్ ఎన్ని గంటలకు అని తనకు సమాచారం లేదని.. తనను పీఆర్ టీం ఎక్కడికి ఏ సమయానికి తీసుకెళ్తే ఆ టైంకి వస్తున్నానని.. తాము ప్రైవేట్ జెట్స్‌లో తిరుగుతున్నామని.. వాటికి పర్మిషన్లు రావడం, ఇతర విషయాల్లో ఆలస్యం జరగడం వల్ల ఇలా ప్రెస్ మీట్ టైంకి మొదలు కాకపోయి ఉండొచ్చని.. దీని గురించి తనకు తెలియదని.. ఐతే పది నిమిషాలు ఆలస్యం జరిగి ఉన్నా అది తమ తప్పే అవుతుందని.. అందుకు అందరినీ మనస్ఫూర్తిగా మన్నించాలని కోరుతున్నానని యశ్ వివరణ ఇచ్చాడు.
విశేషం ఏంటంటే.. ‘పుష్ప’ బెంగళూరు ప్రెస్ మీట్లో సరిగ్గా ఇదే జరిగింది. ఆ కార్యక్రమానికి బన్నీ 2-3 గంటలు ఆలస్యంగా వెళ్లడంతో అక్కడి మీడియా వాళ్లు అతణ్ని నిలదీశారు. అందుకు బన్నీ వాళ్లకు క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడు ఓ కన్నడ హీరోకు తెలుగు నాట ఈ పరిస్థితి ఎదురవడంతో చెల్లుకు చెల్లు అన్నట్లయింది.
This post was last modified on April 11, 2022 7:03 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…