టాలీవుడ్లో మీడియాకు చాలా దూరంగా ఉండే హీరోల్లో ప్రభాస్ ఒకడు. తన సినిమాలు రిలీజైనపుడు తప్పిస్తే మీడియా ముందుకే రాడు. సోషల్ మీడియాలో తన గురించి, తన సినిమాల గురించి అతను అప్ డేట్లు ఇవ్వడం కూడా అరుదు. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్లు అయితే ఉన్నాయి కానీ.. అవి నామమాత్రమే.
సినిమాల ముచ్చట్లు చెప్పడమే తక్కువ అంటే.. వ్యక్తిగత విషయాల గురించి అసలే మాట్లాడడు. అలాంటివాడు ఈ రోజు యోగా దినోత్సవం సందర్భంగా కొన్ని ఫొటోలు, ఒక వీడియో రిలీజ్ చేయడంతో అభిమానులు మురిసిపోతున్నారు.
తాను యోగా స్టూడెంట్ అని వెల్లడిస్తూ.. యోగాతో తన అనుభవాలను ఈ వీడియోలో పంచుకున్నాడు ప్రభాస్. రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య రుహి ప్రభాస్‌కు యోగా టీచర్ అట. ఆమె తనకెంతగా సాయం చేసిందో అతను వెల్లడించాడు.
‘బాహుబలి: ది బిగినింగ్’ టైంలో తాను విపరీతంగా అలసిపోయానని.. ఒళ్లు హూనమైందని.. ఆ సమయంలో తాను కోలుకుని.. మళ్లీ షూటింగ్ చేయడానికి రుహినే సహకరించిందని ప్రభాస్ వెల్లడించాడు. ‘బాహుబలి’ రెండో భాగానికి ముందు కూడా విరామంలో తన బాడీని మళ్లీ రెడీ చేసింది ఆమే అన్నాడు.
యోగాతో ఎంతో రిలీఫ్ ఉంటుందని.. ఫిట్‌గా ఉంటామని.. దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. మరోవైపు రుహి సైతం ప్రభాస్ తన బెస్ట్ స్టూడెంట్ అంటూ అతడికి కితాబిచ్చింది.
మోడీ సర్కారు ఎప్పుడూ యోగాను బాగా ప్రమోట్ చేస్తుంటుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుతుంది. ఈసారి కరోనా వల్ల బయట యాక్టివిటీ తక్కువే ఉంది కానీ.. సోషల్ మీడియాలో మాత్రం యోగా ప్రచారం గట్టిగానే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తన యోగా అనుభవాల వీడియోను పంచుకున్నాడు.
This post was last modified on June 21, 2020 6:15 pm
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…