ఇంకో నాలుగు రోజుల్లో ‘బీస్ట్’ అనే తమిళ అనువాద చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో మార్కెట్ పెంచేసుకోవాలని.. మన హీరోల్లాగే పాన్ ఇండియా స్టార్ అయిపోవాలని విజయ్ ఆశించడం వరకు బాగానే ఉంది కానీ.. కనీసం ఈ చిత్రాన్ని తెలుగులో వచ్చి ప్రమోట్ చేయాలన్న ఆలోచనే విజయ్‌కి రాలేదు.
మిగతా తమిళ స్టార్లందరి క్రేజ్ అంతకంతకూ పడిపోతుంటే.. విజయ్‌కి తెలుగులో నెమ్మదిగా ఫాలోయింగ్ పెరుగుతోంది. ఇలాంటి టైంలో హైదరాబాద్‌కు వచ్చి తెలుగు ప్రేక్షకులను పలకరిస్తే, ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడితే, వారిని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తే విజయ్ సినిమాకు చాలా ప్రయోజనం చేకూరుతుంది. సినిమా బాగుంటే సక్సెస్ రేంజ్ పెరుగుతుంది. కానీ విజయ్ మాత్రం మిన్నకుండిపోయాడు. ఈ సినిమాకే కాదు.. గత చిత్రాలకు కూడా ఇటు వైపు చూడలేదు. ఐతే ఇదే సమయంలో విజయ్‌కు పాఠాలు నేర్పిస్తున్నాడు కన్నడ స్టార్ యశ్.
‘కేజీఎఫ్’ సినిమా తెలుగులో బ్లాక్‌బస్టర్ అయి ‘కేజీఎఫ్-2’కు తెలుగులో ఊహించని క్రేజ్ వచ్చింది. అందుకు తగ్గట్లే బిజినెస్ కూడా భారీగానే జరిగింది. తమ సినిమాకు చేకూరాల్సిన ప్రయోజనం చేకూరింది కదా అని యశ్ ఆగిపోలేదు. తమ సొంత రాష్ట్రంలో కంటే బాగా తెలుగులో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి ప్రణాళికలు వేసుకున్నాడు. రెండు రోజుల పాటు తెలుగులో ప్రమోషనల్ టూర్ వేస్తున్నాడతను.
తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్‌ల్లో అతను ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొనబోతున్నాడు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ చేశాడు. ఆదివారమే అతను తిరుపతిలో అడుగు పెట్టాడు కూడా. తిరుమల దర్శనం చేసుకొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాడు. రేపు వైజాగ్, హైదరాబాద్‌ల్లోనూ ఈవెంట్లు జరగనున్నాయి. తన సినిమాకున్న క్రేజ్‌ను మరింత పెంచడానికి యశ్ మాస్టర్ ప్లానే వేస్తున్నాడని చెప్పాలి. ఇలా ప్రేక్షకులను కలుసుకుని వారిని ఓన్ చేసుకుంటే సినిమాలకు జరిగే ప్రయోజనం వేరని వేరే హీరోలు కూడా గుర్తించాలి.
This post was last modified on April 10, 2022 6:33 pm
రాజమౌళితో సినిమా చేయాలని ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి పేరున్న హీరో ఆశపడుతుంటాడు అనడంలో సందేహం లేదు. ఐతే రాజమౌళి…
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులతో వైరం ఎలా ఉన్నా.. ప్రజలతో మాత్రం పార్టీలకు సాన్నిహిత్యం ఉండాలి. అది కొరవడితే.. ఎప్పటికీ చేరువ…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ట్యాక్సీవాలాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్…
పెద్ద బడ్జెట్ పెట్టి, చాలా కాలం కష్టపడి, ఎన్నో ఆశలతో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే తట్టుకోవడం తేలిక…
ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో అత్యంత శ్రద్ధ చూపిస్తున్న విషయం తెలిసిందే. రైతుల నుంచి భూములు సమీకరించడం(పూలింగ్)…
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…