Movie News

రాజ‌మౌళిపై బాలీవుడ్ లెజెండ్ ప్ర‌శంస‌ల జ‌ల్లు

ఆర్ఆర్ఆర్ సినిమా హిందీలో 200 కోట్ల‌కు పైగా నెట్ వ‌సూళ్లు రాబ‌ట్టింది ఇప్ప‌టిదాకా. మ‌రీ బాహుబ‌లి స్థాయిలో కాదు కానీ.. ఉత్త‌రాది ప్రేక్ష‌కులు ఈ చిత్రాన్ని గొప్ప‌గానే ఆద‌రిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో నార్త్ ఇండియ‌న్స్ ఈ సినిమా చూసి స్పందిస్తున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. మ‌న వాళ్ల కంటే ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌కే సినిమా ఎక్కువ న‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఐతే హిందీలో ఆర్ఆర్ఆర్ ఇంత బాగా ఆడుతుంటే.. బాలీవుడ్ సెల‌బ్రెటీలు మాత్రం ఏం ప‌ట్ట‌న‌ట్లు ఉంటున్నారు. ఆ సినిమా గురించి అక్క‌డి సెల‌బ్రెటీలెవ‌రూ పెద్ద‌గా స్పందించ‌ట్లేదు.

బాలీవుడ్ సినిమాల‌ను సౌత్ మూవీస్ గ‌ట్టి దెబ్బ తీసి త‌మ ఉనికినే దెబ్బ తీసే ప‌రిస్థితి కనిపిస్తుండ‌టం.. ఆ సినిమాలను కొనియాడి వాటికి ప్ర‌మోష‌న్ ఇవ్వ‌డం ఎందుక‌నో ఏమో.. అక్క‌డి సెల‌బ్రెటీలు వ్యూహాత్మ‌క మౌనం పాటిస్తున్న‌ట్లు భావిస్తున్నారు. ఇలాంటి టైంలో ఆర్ఆర్ఆర్ మీద ఓ బాలీవుడ్ లెజెండ్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఆయ‌నెవ‌రో కాదు.. లిరిసిస్ట్ క‌మ్ స్క్రిప్టు రైట‌ర్ జావెద్ అక్త‌ర్. ఆర్ఆర్ఆర్ సినిమా చూసి తాను ముగ్ధుడైన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఆర్ఆర్ఆర్‌ను హిందీలో రిలీజ్ చేసిన జ‌యంతి లాల్ బ‌ల‌వంతం మేర‌కు తానీ సినిమా చూసిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

‘‘వారం రోజులుగా జయంతి లాల్‌ సినిమా చూడమని అడుగుతున్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ చూశా. అదొక విజువ‌ల్ వండ‌ర్ లాగా అనిపించింది. సినిమాకు బడ్జెట్‌ ఎంత పెట్టాం.. ఎంత కలెక్ట్‌ చేసింది అన్నది ముఖ్యం కాదు. ఆ సినిమా సక్సెస్‌ సాధించి గతంలో జరగని విధంగా ఏదన్నా కొత్తగా ఏదన్నా సృష్టిస్తే అది చరిత్రలో నిలిచిపోతుంది. రాజమౌళి తీసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అలా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా.

20 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి, సినిమాను ఇలా తీర్చిదిద్దడానికి టీమ్‌ పడిన కష్టం గురించి చెప్పుకొంటారు. చ‌రిత్ర‌ను ఎవరైనా చెప్పగలరు. దానిని తెరపై ఎంత బాగా ప్రెజెంట్‌ చేశారన్నది ముఖ్యం. రాజమౌళి అదే చేసి చూపించారు. ఆయనలాంటి దర్శకుడిని చూడలేదు. ఆయన విజన్‌కు తగ్గ హీరోలు దొరకడం కూడా అదృష్టం’’ అని జావెద్ అక్త‌ర్ పేర్కొన్నారు.

This post was last modified on April 9, 2022 8:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?

సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…

9 minutes ago

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

1 hour ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

2 hours ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

2 hours ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

3 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago