బాహుబలి రిలీజైనపుడు బాలీవుడ్లో హంగామా మామూలుగా లేదు. తమ సొంత సినిమా స్థాయిలో బాలీవుడ్ ప్రముఖులు ఆ చిత్రాన్ని ప్రమోట్ చేశారు. ఆహా ఓహో అని అక్కడి ప్రముఖులందరూ సినిమాను కొనియాడారు. ముఖ్యంగా బాహుబలి: ది కంక్లూజర్ రిలీజైనపుడైతే హడావుడి మామూలుగా లేదు. ఇది తెలుగు సినిమా అన్న తలపే అక్కడి వాళ్లెవ్వరికీ కలగలేదు.
తామే ఆ సినిమా తీసిన స్థాయిలో దాన్ని బాలీవుడ్ జనాలు మోశారు. కానీ ఆర్ఆర్ఆర్ విషయానికి వచ్చేసరికి బాలీవుడ్ సైలెంటైపోయింది. బాహుబలి స్థాయిలో కాకపోయినా ఆర్ఆర్ఆర్ సైతం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించి ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. కానీ ఈ సినిమా సక్సెస్‌ను గుర్తించడానికి బాలీవుడ్ వెనుకడుగు వేస్తోంది.
ఈ సినిమా గురించి ఏ బాలీవుడ్ సెలబ్రెటీ మాట్లాడట్లేదు. తాజాగా నిర్వహించిన సక్సెస్ పార్టీకి కొందరు ప్రముఖులను పిలిచినా రాలేదని తెలుస్తోంది. మరి బాహుబలికి, ఆర్ఆర్ఆర్‌కు తేడా ఏంటి అంటే.. కరణ్ జోహార్. బాహుబలిలో పార్ట్‌నర్‌గా మారి ఆ సినిమాను ఉత్తరాదిన ఓ రేంజిలో ప్రమోట్ చేశాడు. బాలీవుడ్ ప్రముఖులందరితోనూ ఈ సినిమా గురించి ట్వీట్లు వేయించాడు. ముంబయిలో ప్రమోషన్ల హంగామా మామూలుగా లేదు. సెలబ్రెటీలకు స్పెషల్ షోలు కూడా వేయించి సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు.
ఐతే కరణ్‌తో ఈసారి రాజమౌళి ఎందుకు జట్టు కట్టలేదో ఏమో తెలియదు మరి. ఆర్ఆర్ఆర్‌ను జయంతిలాల్ గద రిలీజ్ చేశారు. దీంతో ఈసారి ఆర్ఆర్ఆర్‌కు సెలబ్రెటీల సపోర్ట్ దక్కలేదు. ప్రమోషన్స్ పరంగా ఈ సినిమా పెద్ద ఇంపాక్ట్ వేయలేకపోయింది. ఈ సినిమాలో నటించిన అజయ్ దేవగణ్, ఆలియా భట్ కూడా అంటీ ముట్టనట్లే ఉండిపోయారు. పెద్దగా ప్రమోషన్లు చేసింది లేదు. ఒకవేళ కరణ్ కనుక ఈ సినిమాలోనూ భాగస్వామి అయి ఉంటే ప్రమోషన్ల మోత మోగేది. వసూళ్ల మీద కూడా ఆ ప్రభావం ఉండేది. సినిమా ఇంకా పెద్ద సక్సెస్ అయ్యేదేమో.
This post was last modified on April 8, 2022 9:30 pm
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…