నందమూరి బాలకృష్ణ ఇటీవలే 60వ పుట్టిన రోజు జరుపుకున్నారు. కరోనా-లాక్ డౌన్ వల్ల సంబరాల్లో కళ తగ్గింది కానీ.. లేదంటే హంగామా ఒక రేంజిలో ఉండేదే. సోషల్ మీడియాలో మాత్రం బాలయ్య పుట్టిన రోజు హడావుడిగా బాగానే కనిపించింది.
సమయానికి బోయపాటి సినిమా టీజర్ కూడా రావడంతో అభిమానులు సోషల్ మీడియాను బాలయ్య ట్వీట్లతో హోరెత్తించారు. ఐతే బాలయ్య బర్త్ డేకు సంబంధించిన ఇప్పుడు ఓ అరుదైన రికార్డు అభిమానుల్ని సంతోషంలో ముంచెత్తుతోంది.
ఆ రోజు ఒకే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 21 వేల మంది బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకుని కేక్ కట్ చేశారట. జూన్ 10న ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఇది జరిగిందట. ఇది ప్రపంచ రికార్డు కావడం విశేషం. ఈ ఘనత గిన్నిస్ బుక్‌తో పాటు వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి కూడా ఎక్కిందట.
ఒక వ్యక్తి పుట్టిన రోజును పురస్కరించుకుని ఇంత ఎక్కువమంది ఒకేసారి ఆర్గనైజ్డ్‌గా ఒకే సమయానికి కేక్ కట్ చేయడం ప్రపంచంలో ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు. గత రికార్డును తెలుసుకుని ముందే బాలయ్య అభిమానులు రికార్డు కోసం ప్రయత్నించారు.
ముందే గిన్నిస్ రికార్డు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు వాళ్లకు సమాచారం ఇచ్చి ఈ రికార్డును డాక్యుమెంట్ చేయించారు. ఆ రెండు సంస్థల ప్రతినిధులు రికార్డును ధ్రువీకరించడమే కాక త్వరలోనే సర్టిఫికెట్లు కూడా జారీ చేయబోతున్నారు. దీనిపై బాలయ్య సైతం స్పందించాడు.
రికార్డు విషయమై అభిమానుల్ని అభినందించాడు. బాలయ్య వీరాభిమాని అనంతపురం జగన్ వరల్డ్ వైడ్ ఫ్యాన్స్‌తో కో ఆర్డినేట్ చేసుకుంటూ ఈ ఘనతను పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కరోనా-లాక్‌డౌన్ వల్ల బాలయ్య షష్టిపూర్తి వేడుకల కళ తగ్గిందని కొంచెం ఫీలైన అభిమానులకు ఈ రికార్డులు అమితానందాన్నిచ్చేవే.
This post was last modified on June 21, 2020 1:31 pm
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…