పెద్ద సినిమాలకు తెలంగాణలో వారం పది రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచడం మామూలైపోయింది. సాధారణంగానే తెలంగాణలో టికెట్ల ధరలు పెరిగాయి. అవే భారం అనుకుంటుంటే.. పెద్ద సినిమాలకు ఈ అదనపు పెంపుతో టికెట్ల రేట్లు తడిసి మోపెడవుతున్నాయి. మధ్యలో ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల ధరలు తగ్గగా.. ఇటీవల అవి పెరిగి మునుపటి స్థాయికి చేరుకున్నాయి. అక్కడ కూడా పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పిస్తున్నారు. ఇందుకు కొన్ని నిబంధనలు కూడా పెట్టారు.
ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాకు రేట్ల పెంపు మరీ ఎక్కువగా ఉండి ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా ఆ సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా ఆ రేట్లు చెల్లిపోయాయి. ఈ వారం రిలీజవతున్న గనికి రేట్లు పెంచుకుంటే అసలుకే మోసం వస్తుందని సాధారణ ధరలతోనే ముందుకెళ్తున్నారు.
కాగా వచ్చే వారం రిలీజయ్యే ఓ డబ్బింగ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రేట్ల పెంపు దిశగా గట్టి ప్రయత్నాలే జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఆ చిత్రం.. కేజీఎఫ్-2 అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మూడేళ్ల కిందట సంచలన విజయం సాధించిన కేజీఎఫ్-చాప్టర్ 1కు కొనసాగింపుగా వస్తున్న చాప్టర్-2పై అంచనాలు మామూలుగా లేవు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి తెలుగు నిర్మాత సాయి కొర్రపాటి, డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వ పెద్దల్ని కలుస్తున్నట్లు తెలిసింది.
ఈ చిత్రంపై బయ్యర్లు భారీ పెట్టుబడులే పెట్టారు. ఆ మొత్తాలు రికవర్ చేసుకోవాలంటే రేట్లు పెంచాల్సిందే. కానీ మన నిర్మాతలు తీసే సినిమాలకు రేట్లు పెంచితే ఓకే కానీ.. వేరే భాషలో తెరకెక్కిన చిత్రాన్ని ఆ నిర్మాత భారీ రేట్లకు అమ్మడం, మన వాళ్లు కొనడం, ఇప్పుడు టికెట్ల రేట్లు పెంచి ప్రేక్షకుల జేబులకు చిల్లు పెట్టాలని చూడటం ఎంత వరకు సమంజసం అన్నది ప్రశ్న?
This post was last modified on April 8, 2022 2:41 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…