వరుణ్ తేజ్ కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా.. గని. గద్దలకొండ గణేష్ తర్వాత మూడేళ్లకు అతడి నుంచి వస్తున్న సినిమా ఇది. వరుణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించారు. బిజినెస్ కూడా అదే రేంజిలో జరిగింది. ‘గద్దలకొండ గణేష్’ ఫుల్ రన్లో రూ.25 కోట్ల మేర షేర్ రాబడితే.. అంతకు రెండు కోట్లు ఎక్కువకు థియేట్రికల్ రైట్స్ అమ్మారు మేకర్స్. నైజాం హక్కులు రూ.8 కోట్లు పలకగా.. సీడెడ్ రైట్స్ రూ.3.6 కోట్లకు అమ్మారు.
ఆంధ్రాలో మిగతా ఏరియాలన్నీ కలిపి ఈ చిత్రం దాదాపు రూ.10 కోట్ల దాకా బిజినెస్ చేసింది. కర్ణాటక హక్కులు రూ.1.7 కోట్లకు ఇవ్వగా.. ఓవర్సీస్ రైట్స్ కూడా దాదాపు అంతే పలికాయి. మొత్తంగా ఈ చిత్రం రూ.27 కోట్ల షేర్ రాబడితే బ్రేక్ ఈవెన్ అయినట్లన్నమాట. నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా కలిపితే ‘గని’ రూ.50 కోట్ల దాకా బిజినెస్ చేసినట్లు అవుతుంది. కొన్ని ఏరియాల వరకు నిర్మాతలే సొంతంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.‘గని’ మీద ఉన్న అంచనాల ప్రకారం చూస్తే మామూలు టైంలో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ అవ్వడం తేలికే అయ్యేదేమో.
కానీ ఇప్పుడు ఆ చిత్రానికి పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవు. ‘ఆర్ఆర్ఆర్’ ఇంకా థియేటర్లలో ఉంది. బాగా ఆడుతోంది కూడా. వీక్ డేస్‌లోనూ ఓ మోస్తరు వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం.. వీకెండ్లో ఇంకా పుంజుకుంటుందనే అంచనాలున్నాయి. తగ్గించిన టికెట్ల రేట్లు ఆ సినిమాకు కలిసొస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా థియేటర్లకు కదులుతున్నారు.
మరి రెగ్యులర్ సినీ లవర్స్ కాకుండా మిగతా ప్రేక్షకులు అంత భారీ చిత్రాన్ని కాదని ‘గని’ వైపు మళ్లడమే సవాల్. ఇక ఈ చిత్రానికి ఉన్న మరో ముప్పు తర్వాతి వారంలో రాబోతున్న చిత్రాలు. ‘గని’ రిలీజైన ఆరు రోజులకే ‘బీస్ట్’, తర్వాతి రోజు ‘కేజీఫ్-2’ మంచి అంచనాల మధ్య రిలీజవుతున్నాయి. కాబట్టి ‘గని’ ఏం సాధించినా వారం రోజుల్లోనే సాధించాలి. ముఖ్యంగా వీకెండ్లో వసూళ్లు దంచుకోకుంటే తర్వాత కష్టమవుతుంది.
This post was last modified on April 8, 2022 11:32 am
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…