ఆర్ఆర్ఆర్ సీక్వెల్.. ఆర్ఆర్ఆర్ సీక్వెల్.. కొన్ని రోజుల నుంచి ఇదే చర్చ. ‘ఆర్ఆర్ఆర్’ రచయిత విజయేంద్ర ప్రసాద్.. ఈ చిత్రానికి సీక్వెల్ తీసే అవకాశాలున్నట్లు చిన్న సంకేతం ఇవ్వడంతో దీని గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు జనాలు. ఈ చిత్రానికి ఇంకో పార్ట్ తీస్తే కథ ఎలా ఉంటుందనే విషయంలోనూ ఊహాగానాలు నడిచిపోతున్నాయి. ఐతే నిజంగా ఈ సినిమాకు ఇంకో భాగం తీసే అవకాశం ఉందా అంటే ఔనని గట్టిగా చెప్పలేం.
ఇందుకు పరిస్థితులు సహకరించేలా లేవు. ‘బాహుబలి’ రెండో భాగం కోసం ఉత్కంఠగా ఎదురు చూసినట్లు ఆర్ఆర్ఆర్-2పై ఆసక్తి ప్రదర్శించడానికి కారణాలేవీ కనిపించవు. అసలు ‘ఆర్ఆర్ఆర్’ కథ, ఇందులోని లీడ్ క్యారెక్టర్స్ విషయంలోనే చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ ఎంత కలెక్షన్ల మోత మోగించినా.. ‘బాహుబలి’కి వచ్చినట్లు యూనివర్శల్ అప్లాజ్ అయితే ఈ సినిమాకు రాలేదు. పలు విషయాల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.కథ లాజికల్‌గా లేదని, మనసుకు హత్తుకోలేదని, ఎమోషన్లు అనుకున్న స్థాయిలో పండలేదని, అల్లూరి-కొమరం భీం పాత్రల్ని బలవంతంగా కలిపినట్లుందని.. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి.
ఫస్ట్ పార్ట్ కథే పూర్తి సంతృప్తినివ్వనపుడు.. ఈ కథను పొడిగిస్తే జనామోదం లభిస్తుందా అన్నది సందేహమే. మరోవైపు రాజమౌళితో పాటు హీరోలకు ఉన్న కమిట్మెంట్ల ప్రకారం చూసినా.. మళ్లీ ‘ఆర్ఆర్ఆర్-2’ అని చెప్పి ఇంకో మూణ్నాలుగేళ్లు ఈ సినిమాపై ఖర్చు పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. జక్కన్న ముందు మహేష్‌తో సినిమా చేయాలి. దీనికి రెండు మూడేళ్లు పడుతుంది. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేస్తాడని అంటున్నారు.
ఈలోపు ఎప్పట్నుంచో ఆయన కోసం ఎదురు చూస్తున్న ‘మహాభారతం’ ఉండనే ఉంది. మహేష్ సినిమా రిలీజయ్యే సమయానికే ఆ కలల ప్రాజెక్టుకు రాజమౌళి చెప్పిన పదేళ్ల అనుభవం వచ్చేసినట్లవుతుంది. ఇక మహాభారతానికి స్క్రిప్టు రాయాలంటే విజయేంద్ర ప్రసాదే రాయాలి. ‘ఆర్ఆర్ఆర్-2’ కోసం మధ్యలో ఇంకో మూడేళ్ల పాటు అందరూ సమయం పెట్టే పరిస్థితి ఎంతమాత్రం కనిపించడం లేదు. కేవలం ఊరికే ప్రస్తుతం సినిమా పబ్లిసిటీ కోసం ఈ ఎత్తుగడ వేసి ఉండొచ్చని భావించవచ్చు.
This post was last modified on April 6, 2022 5:34 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…