ఉయ్యాల జంపాల, కుమారి 21 ఎఫ్, సినిమా చూపిస్త మావ సినిమాలతో కెరీర్ ఆరంభంలో చాలా ప్రామిసింగ్‌గా కనిపించాడు యువ కథానాయకుడు రాజ్ తరుణ్. ఆ ఊపు చూసి మంచి రేంజికి వెళ్తాడని అనుకుంటే.. సరైన సినిమాలు ఎంచుకోక చతికిల పడ్డాడు. మధ్యలో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమా తప్పితే ఓ మోస్తరుగా ఆడిన సినిమా ఏదీ లేదు అతడి కెరీర్లో. ఈ మధ్య అతడి సినిమాలు మరీ పేలవంగా తయారయ్యాయి.
బాక్సాఫీస్ దగ్గర అసలేమాత్రం ప్రభావం చూపడం లేదు.పవర్ ప్లే, అనుభవించు రాజా, స్టాండప్ రాహుల్.. ఇవీ అతడి చివరి మూడు చిత్రాలు. ఇవి ఒకదాన్నిమించి ఒకటి డిజాస్టర్లయ్యాయి. ‘స్టాండప్ రాహుల్’ అయితే రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి తేలేకపోయింది. ఇప్పటిదాకా ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఇక అతడికి సినిమాల్లో ఛాన్సులు లేనట్లే కనిపిస్తోంది.
ఇలాంటి తరుణంలో రాజ్ తరుణ్ వెబ్ సిరీస్‌ల బాట పడుతున్నాడు. అతను ప్రధాన పాత్రలో ‘అహ నా పెళ్ళంట’ అనే వెబ్ సిరీస్ మొదలైంది. జీ5 సంస్థ ఈ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేస్తోంది. ఇంతకుముందు అల్లు శిరీష్ హీరోగా ‘ఏబీసీడీ’ అనే సినిమా తీసిన సంజీవ్ రెడ్డి ఈ సిరీస్‌కు దర్శకుడు. రాజ్ సరసన ఇందులో రాజశేఖర్ తనయురాలు శివాని నటించనుంది. ఆమె ఫిలిం కెరీర్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలోనే అడివి శేష్‌కు జోడీగా ‘2 స్టేట్స్’ రీమేక్‌తో ఆమె కథానాయికగా పరిచయం కావాల్సింది. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత అద్భుతం, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనే సినిమాల్లో ఆమె నటించింది. ఇవి రెండూ ఓటీటీల్లో రిలీజై అంత మంచి స్పందనేమీ తెచ్చుకోలేదు.
శివాని విషయంలో నెగెటివ్ ఫీడ్ బ్యాకే వచ్చింది. ప్రస్తుతానికి ఆమెకు కూడా సినిమాల్లో అవకాశాలేమీ లేనట్లే కనిపిస్తోంది. ‘అహనా పెళ్ళంట’ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. తనకు పెళ్ళి జరగాల్సిన రోజు.. పెళ్ళికూతురు వేరే అబ్బాయితో లేచి పోతే.. ఆమె మెడలో కట్టాల్సిన తాళిని చేతికి కట్టుకుని ఆమె మీద ప్రతీకారానికి సిద్ధపడే కుర్రాడి స్టోరీ అట ఇది. వినడానికి లైన్ బాగానే ఉంది. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పిస్తుందో చూడాలి.
This post was last modified on April 5, 2022 5:59 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…