హైదరాబాద్‌లో సంచలనం రేపిన రేవ్ పార్టీ వ్యవహారంలో తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు, మహేష్ బాబు మేనల్లుడు అయిన గల్లా అశోక్ పేరు కూడా వినిపించడం తెలిసిందే. బంజారాహిల్స్‌లోని పబ్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్న వారిలో అశోక్ కూడా ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఐతే ఈ ప్రచారాన్ని కొన్ని గంటల్లోనే గల్లా కుటుంబం ఖండించింది.
అశోక్‌కు ఈ వ్యవహారంతో సంబంధమే లేదని వివరణ ఇచ్చింది. అయినా సరే ఈ ప్రచారం ఆగలేదు. ఈ నేపథ్యంలో గల్లా అశోక్ స్వయంగా మీడియాకు వివరణ ఇచ్చాడు. ఏప్రిల్ 5న తన పుట్టిన రోజు నేపథ్యంలో మీడియాను కలిసిన అతను.. ఈ రేవ్ పార్టీ గొడవపైనా మాట్లాడాడు. పబ్ ఇష్యూలో మీ పేరు కూడా వినిపించింది. అప్పుడెలా అనిపించింది అని మీడియా వాళ్లు ప్రశ్నించగా.. ‘‘ఆరోజు రాత్రి నేను ఫిజియో థెరపీ చేయించుకుంటున్నాను. సడన్‌గా వార్తల్లో నా పేరు ఎలా వచ్చిందో తెలీదు. అప్పుడు నిజంగా నాకు హీరో అనే ఫీలింగ్ కలిగింది. సెలబ్రిటీ లైఫ్‌లో ఉంటే ఇలానే రూమర్లు వస్తుంటాయనిపించింది అని అశోక్ తెలిపాడు.
ఇక తన కెరీర్ గురించి అశోక్ మాట్లాడుతూ.. తొలి చిత్రం హీరో పూర్తి సంతృప్తినివ్వలేదన్నట్లు మాట్లాడాడు. కరోనా కారణంగా సంక్రాంతి టైంలో థియేటర్లకు రావాల్సిన స్థాయిలో క్రౌడ్ రాలేదని, దాని వల్ల సినిమాకు కొంత నష్టం జరిగిందని చెప్పాడు.
ఐతే ఈ సినిమా నటుడిగా తనకు మంచి అనుభవం అని, హీరో చూసిన మహేష్ బాబు తనను చూసి గర్విస్తున్నట్లు చెప్పాడని.. తర్వాత ఇంకేవో మాటలు అన్నా కూడా ఆ ఒక్క మాట దగ్గర తాను ఆగిపోయానని అశోక్ చెప్పాడు. మహేష్ సినిమాల్లో రీమేక్ చేయాల్సి వస్తే మురారి మూవీ చేయాలనుకుంటున్నట్లు అశోక్ తెలిపాడు.
This post was last modified on April 5, 2022 9:59 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…