తెలుగు సినిమా చరిత్రలోనే మెగాస్టార్ చిరంజీవితో మరే హీరోనూ పోల్చడానికి వీల్లేదు. ఆయనలా ఏ రసాన్నయినా అద్భుతంగా పండించగల ఆల్ రౌండర్ మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఐతే ఈ మధ్య అల్లు అర్జున్ అభిమానులు.. తమ హీరోను చిరుతో పోలుస్తున్నారు. కొత్త మెగాస్టార్ అని కొనియాడుతున్నారు. అల వైకుంఠపురములో, పుష్ప సినిమాలతో భారీ విజయాలందుకుని తిరుగులేని స్థాయిని అందుకున్న నేపథ్యంలో వాళ్లు బన్నీని ఆకాశానికెత్తేస్తున్నారు.
అత్యుత్సాహంతో బన్నీ పేరు ముందు ‘మెగాస్టార్’ అని కూడా జోడించేశారు కొందరు ఫ్యాన్స్. ఆ మధ్య ‘ఆహా’ ఓటీటీ వాళ్లు కూడా బన్నీ పేరు ముందు ‘మెగాస్టార్’ పెట్టడం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీ అన్నయ్య అల్లు బాబీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరుతో బన్నీకి పోలిక పెట్టడం గురించి స్పందించారు.చిరుతో బన్నీకి పోలిక గురించి ప్రశ్నిస్తే.. ‘‘నేను ఎప్పటికీ చిరంజీవి గారిని, అల్లు అర్జున్‌ను పోల్చి చూడను. అలా పోల్చి చూడటం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే చిరంజీవి గారు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి అడుగు పెట్టి.. ఎన్నో కష్టాలు ఎదుర్కొని మెగాస్టార్ అయ్యారు.
ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. బన్నీ అలా కాదు. తన వెనుక మా నాన్న, తాతయ్య ఉన్నారు. మరో విషయం ఏంటంటే.. మా కుటుంబంలో ఎంతోమందికి చిరంజీవి గారుస్ఫూర్తి. బన్నీ కూడా తనకు చిరునే స్ఫూర్తి అని ఎన్నోసార్లు చెప్పాడు. మనలో స్ఫూర్తి నింపిన వ్యక్తితో మనం ఎప్పటికీ పోల్చుకోకూడదు’’ అని బాబీ అన్నాడు.
ఇక బన్నీ కెరీర్ గురించి అడిగితే.. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత బన్నీ ఎంతో పరిణతి చెందాడని.. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సినిమా పరాజయం పాలయ్యాక రెండేళ్లు గ్యాప్ తీసుకుని, ప్రేక్షకులు తన నుంచి ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు.. ఎలాంటి కథలు చేయాలని.. అని పున:పరిశీలన చేసుకున్నాడని.. దాని ఫలితమే ‘అల వైకుంఠపురములో’లో అంత పెద్ద విజయం దక్కిందని బాబీ విశ్లేషించాడు.
This post was last modified on April 3, 2022 10:20 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…