Movie News

అమీర్ ఖాన్ ఆఫర్.. రాజమౌళి రిజెక్ట్!

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ‘ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్‌’ అనే హోదాను అనుభవిస్తున్నాడు కానీ.. అంతకుముందు మాత్రం ఆమిర్ ఖాన్‌దే ఈ స్థానం. ప్రభాస్ అయినా రాజమౌళి అండతో అనుకోకుండా పెద్ద స్టార్ అయిపోయాడు కానీ.. ఆమిర్ ఖాన్ అలా కాదు. నిలకడగా విజయాలు సాధిస్తూ, డైరెక్టర్ ఎవరన్నది సంబంధం లేకుండా రికార్డులు బద్దలు కొడుతూ.. తన సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయిని పెంచుతూ తన పేరు చూసి కోట్లాది మంది థియేటర్లకు వచ్చేలా ఇమేజ్ పెంచుకుంటూ ఆ స్థాయిని అందుకున్నాడు.

ఆయనతో సినిమా చేయాలని ఇండియాలో ప్రతి దర్శకుడూ ఆశిస్తాడంటే అతిశయోక్తి కాదు. అలాంటి దర్శకుడు ఒక సౌత్ డైరెక్టర్‌ని తనతో సినిమా చేయమని అడిగితే.. అతను కాదంటాడని ఎవరైనా అనుకుంటారా? కానీ మన దర్శక ధీరుడు రాజమౌళి.. ఆమిర్ అంతటి వాడికి ‘నో’ చెప్పాడట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి స్థాయి అమాంతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆమిర్.. రాజమౌళితో పని చేయాలనుకున్నాడట. ఆయనతో మహాభారత గాథను తెరకెక్కించాలన్నది ఆమిర్ ఆలోచన. ఇందుకోసం ముందుగా విజయేంద్ర ప్రసాద్‌నే సంప్రదించాడట ఆమిర్. మహాభారతం మీద సినిమాకు స్క్రిప్టు రాయమని అడిగితే..ఈ కథను సినిమాగా తీయాలంటే ఆరేడు భాగాలుగా తీయాల్సి ఉంటుందని, ఐతే మొత్తం స్క్రిప్టును తాను రాయలేనని.. వేరే కమిట్మెంట్ల వల్ల తనకు అంత సమయం లేదని.. ఐతే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీస్తే బాగుంటుందో ఒక ఔట్ లైన్ గీసి.. ఓవరాల్ కథ వరకు రాసి పెడతానని.. పూర్తి స్థాయి స్క్రిప్టును వేరే వాళ్లతో రాయించుకోవాలని తాను ఆమిర్‌కు చెప్పానని విజయేంద్ర వెల్లడించారు.

ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేయాలని ఆమిర్.. రాజమౌళిని అడగ్గా, తాను స్వయంగా మహాభారత గాథను తెరకెక్కించాలని అనుకుంటున్నానని, అందుకు ఇంకా సమయం పడుతుందని, మధ్యలో తనకు వేరే కమిట్మంట్లు ఉన్నాయని చెప్పి ఆమిర్ ఆఫర్‌ను రాజమౌళి సున్నితంగా తిరస్కరించినట్లు విజయేంద్ర తెలిపారు.

This post was last modified on April 3, 2022 6:33 pm

Share

Recent Posts

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

1 hour ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

4 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

12 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

14 hours ago