ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది గని సినిమా. ఇక లాభం లేదని ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికే సిద్ధమైపోయారు దాని నిర్మాతలు. కానీ పరిస్థితులు చూస్తే మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. ఆర్ఆర్ఆర్ హవా రెండు వారాలకు తగ్గిపోతుందని అనుకున్నారు కానీ.. అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. రెండో వీకెండ్లో కొత్త సినిమా తరహాలో వసూళ్ల మోత మోగిస్తోందీ సినిమా. దానికి ఎదురే లేదు ఎక్కడా.
హిందీలో ఎటాక్ లాంటి పేరున్న సినిమా రిలీజ్ కాగా.. దాని ప్రభావం ఆర్ఆర్ఆర్ మీద పెద్దగా పడేలా కనిపించడం లేదు. ఆర్ఆర్ఆర్ ధాటికి అదే గట్టిగా దెబ్బ తినే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగులో మిషన్ ఇంపాజిబుల్ మూవీ పరిస్థితి మరీ ఇబ్బందికరంగా తయారైంది. దీంతో పోలిస్తే గని పెద్ద సినిమానే. దానికి క్రేజున్న మాట వాస్తవం. కానీ ఈ చిత్రంపై నిర్మాతలు, బయ్యర్లు భారీ పెట్టుబడులే పెట్టేశారు.
సినిమాకు చాలా మంచి టాక్ రావాలి. లాంగ్ రన్ కూడా ఉండాలి. కానీ ఆ సినిమా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి తరహాలోనే ఉంది. ముందేమో ఆర్ఆర్ఆర్ పోటీని తట్టుకుని నిలబడాలి. ఆ తర్వాత వారం తిరక్కముందే కేజీఎఫ్-2 లాంటి భారీ అంచనాలున్న సినిమాకు ఎదురు నిలవాలి. కేజీఎఫ్-2 తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజవుతోంది. దానికి హైప్ మామూలుగా లేదు.
దాంతో పాటుగా ముందు రోజే రిలీజవుతున్న తమిళ అనువాద చిత్రం బీస్ట్‌కు కూడా బాగానే బజ్ కనిపిస్తోంది. మరి ఇన్ని సినిమాల మధ్య వరుణ్ తేజ్ మూవీ ఏమాత్రం నిలబడుతుంది.. నిర్మాతలు, బయ్యర్లను ఎంత మేర బయటపడేస్తుంది అన్న భయాలు లేకపోలేదు. ఐతే మేకర్స్ మాత్రం సినిమా ఫలితం మీద ధీమాగానే ఉన్నారు. వరుణ్ సరసన సయీ మంజ్రేకర్ నటించిన ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషించారు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్నిరూపొందించాడు.
This post was last modified on April 2, 2022 12:24 pm
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…