ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా సినీ ప్రియుల చర్చలన్నీ ఆర్ఆర్ఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి. బాహుబలి తర్వాత మరోసారి రాజమౌళి తన బాక్సాఫీస్ మ్యాజిక్‌ను చూపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల అవతల బాహుబలి స్థాయిలో హైప్ లేకపోయినా.. రిలీజ్ తర్వాత ఆర్ఆర్ఆర్ అద్భుతాలే చేస్తోంది. దేశవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది.
ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ సినిమా వసూళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. తొలి వీకెండ్‌ను మించి రెండో వీకెండ్లో వసూళ్లు వచ్చేలా ఉన్నాయి. ఈ ప్రభంజనం ఇలా సాగుతున్న సమయంలో ఆర్ఆర్ఆర్‌ను మెచ్చిన వాళ్లందరినీ మరింత సంతోషపెట్టే వార్త బయటికి వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశాలున్నాయట.
ఈ విషయాన్ని స్వయంగా చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాదే ధ్రువీకరించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి మాట్లాడారు. అందుకు ఛాన్సుందా అని అడిగితే.. ఔనని సంకేతాలు ఇచ్చారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తమ ఇంటికి వచ్చాడని, ఆ సందర్భంగా సీక్వెల్ గురించి చర్చ జరిగిందని, అప్పుడు రాజమౌళి కూడా ఉన్నాడని.. సీక్వెల్ చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించామని, తాను కొన్ని ఐడియాలు చెప్పగా అందరూ సానుకూలంగా స్పందించారని, కాబట్టి ఈ చిత్రానికి కొనసాగింపుగా మరో సినిమా చేసే అవకాశాలు లేకపోలేదని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.
ఆయన అంత ధీమాగా ఈ మాట చెప్పారంటే ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కచ్చితంగా ఉంటుందనే అనుకోవచ్చు. మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అయ్యాక ఆర్ఆర్ఆర్-2ను పట్టాలెక్కించడానికి ప్రయత్నిస్తారేమో. ఈ సినిమా చూసిన చాలామంది సీక్వెల్ చేయడానికి స్కోప్ ఉందనే అనుకున్నమాట నిజం.
This post was last modified on April 2, 2022 9:20 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…