Movie News

‘రాధేశ్యామ్’ ముంచింది.. ‘ఆర్ఆర్ఆర్’ తేల్చింది

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో రెండు చిత్రాలు రెండు వారాల వ్యవధిలో రిలీజయ్యాయి. అందులో ముందు ప్రేక్షకులను పలకరించిన సినిమా ‘రాధేశ్యామ్’. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన రెండో చిత్రమిది. ‘సాహో’ నిరాశ పరిచిన నేపథ్యంలో ప్రభాసే కాక అభిమానులంతా దీనిపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణకుమార్ ఐదేళ్లకు పైగా కష్టాన్ని ఈ సినిమా మీద పెడితే.. యువి క్రియేషన్స్ వాళ్లు రాజీ లేకుండా వందల కోట్లు పోసి ఈ సినిమాను నిర్మించారు.

‘సాహో’ చేదు అనుభవం మిగిల్చినప్పటికీ బయ్యర్లు అందరూ ప్రభాస్‌ను నమ్మి ఈ చిత్రంపై భారీగా పెట్టుబడులు పెట్టారు. కానీ వారి నమ్మకం ఫలించలేదు. డివైడ్ టాక్‌తో మొదలైన ‘రాధేశ్యామ్’ వీకెండ్ వరకే సత్తా చాటింది. ఆ తర్వాత చతికిలబడింది. మళ్లీ పుంజుకోనే లేదు. దీంతో బయ్యర్లకు భారీ నష్టాలు తప్పలేదు. నైజాం ఏరియాలో ఈ సినిమాను రిలీజ్ చేసిన దిల్ రాజుకు గట్టి దెబ్బే తగిలింది.

రాజు కెరీర్లోనే అత్యధికంగా రూ.15 కోట్లకు పైగా ఈ చిత్రం నష్టాలు తెచ్చి పెట్టింది. ఓవరాల్‌గా కూడా నష్టాల పరంగా చూస్తే ఇది ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ కావడం గమనార్హం. యువి క్రియేషన్స్ వాళ్లు బయ్యర్లకు ఏదో సెటిల్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి కానీ.. అవి ఎంత మేర, ఎప్పుడన్న క్లారిటీ లేదు. ఐతే ‘రాధేశ్యామ్’ నిర్మాతలు ఏమేర ఆదుకున్నారో కానీ.. దిల్ రాజు వరకు ‘ఆర్ఆర్ఆర్’తో బాగానే బయటపడ్డారు.

‘రాధేశ్యామ్’ గాయాలకు ఈ చిత్రం బాగానే మందు రాస్తోంది. తన కెరీర్లోనే ఆయన అత్యధిక లాభాలు అందుకుంటున్నది ఈ చిత్రంతోనే. నైజాం ఏరియాలో ‘ఆర్ఆర్ఆర్’ సంచలనాలు మామూలుగా లేవు. రూ.70 కోట్లకు హక్కులు కొని రిలీజ్ చేసిన దిల్ రాజుకు వారం తిరక్కుండానే డబ్బులు వెనక్కి వచ్చేశాయి. బంపర్ క్రేజ్‌కు తోడు నైజాంలో భారీగా ఉన్న టికెట్ల ధరలు దిల్ రాజు పంట పండించాయి. వీకెండ్ వరకు హౌస్ ఫుల్స్‌తో, ఆ తర్వాత కూడా మంచి ఆక్యుపెన్సీతో సినిమా నడవడంతో దిల్ రాజు చింత తీరిపోయింది. ఆల్రెడీ లాభాల్లోకి వచ్చేసిన ఈ చిత్రం ఫుల్ రన్లో నైజాంలో రూ.100 కోట్ల షేర్ మార్కును దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి రాజు ఏ స్థాయిలో లాభపడ్డారో అర్థం చేసుకోవచ్చు.

This post was last modified on April 1, 2022 5:29 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

5 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

6 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

6 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

7 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

7 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

8 hours ago