సినిమా మొదలైంది ఇప్పుడే. అలాంటపుడు ట్రైలర్ ఎలా రిలీజవుతుంది.. అదెలా అదిరిపోతుంది అని డౌట్ వస్తోందా? ఇది పూరి జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘జనగణమన’ కాదులెండి. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్-సూరజ్ వెంజరమూడు కలయిలో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన సినిమా అది. డిజో జోస్ ఆంటోనీ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రెగ్యులర్‌గా మనం చూసే సినిమా ట్రైలర్లలా లేదిది. సినిమాలోని కీలక సన్నివేశాలు, షాట్లు తీసుకుని పేర్చేయడం కాకుండా.. ఒక కాన్సెప్ట్ ప్రకారం సాగిందీ ట్రైలర్. న్యాయం కోసం ప్రశ్నించే క్రమంలో రాజకీయ నేతలపై ఎదురు తిరిగి సర్వం కోల్పోయి.. ఊతకర్ర సాయంతో నడవాల్సిన స్థితికి చేరుకున్న వ్యక్తిగా ఇందులో పృథ్వీరాజ్ కనిపించాడు.
అతను ఒక మంత్రి ఆఫీస్ ముందు కూర్చుని ఉంటాడు. లోపల్నుంచి తనకు పిలుపు రావడంతో వెళ్తాడు. అతణ్ని చూసి మంత్రి వేళాకోళంగా మాట్లాడతాడు. వ్యవస్థ మీద ఎదురు తిరిగితే, అన్యాయంపై ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో చూశావ్ కదా అంటాడు. ఇంకెవరైనా నీలా నోరెత్తుతారా అని వెటకారమాడి.. నన్ను సాయం అడిగి వచ్చావ్ కదా అది నేను చూసుకుంటా అని చెప్పి పృథ్వీరాజ్‌ను సాగనంపుతాడు. హీరో ఆఫీస్ నుంచి బయటికి అడుగు పెడుతున్నపుడు ఉంటుంది అసలు ట్విస్ట్. అదేంటన్నది ట్రైలర్ చూసే తెలుసుకోవాలి.
ట్రైలర్లో ఆ ట్విస్టే మేజర్ హైలైట్. అది చూసి వావ్ అనుకోకుండా ఉండలేరు. ట్రైలర్లో పృథ్వీరాజ్ ఎపిసోడ్‌కు సమాంతరంగా సూరజ్‌ను పోలీసాఫీసర్‌గా కొన్ని షాట్లు చూపించారు. అవి కూడా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ట్రైలర్ చూశాక సినిమా మీద అంచనాలు పెరిగిపోవడం ఖాయం. పృథ్వీరాజ-సూరజ్ కలయికలో ఇంతకుముందు వచ్చిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ సూపర్ హిట్ అయింది. వీరి కాంబినేషన్ క్రేజ్‌కు తోడు.. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ‘జనగణమన’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
This post was last modified on %s = human-readable time difference 5:17 pm
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్…