బాలీవుడ్ వాళ్ల బాధ ఇప్పుడు మామూలుగా లేదు. సౌత్ సినిమాలు ఉత్తరాదిన భారీ ఎత్తున రిలీజై వసూళ్ల మోత మోగిస్తుండటం.. బాలీవుడ్ సినిమాలు వెలవెలబోయేలా చేస్తుండటం వారికి జీర్ణించుకోలేని విషయమే. తమ సినిమాలు లేనపుడు సౌత్ చిత్రాలు రిలీజై వసూళ్లు తెచ్చుకుంటే ఇబ్బంది లేదు కానీ.. తమ సినిమాలకు పోటీగా దిగి, వాటిని పక్కకు నెట్టి బాక్సాఫీస్‌ను ఏలుతుండటమే వారికి రుచించడం లేదు. గత ఏడాది చివర్లో ‘83’ లాంటి పెద్ద సినిమా ‘పుష్ప’ హిందీ వెర్షన్ దాటికి దారుణంగా దెబ్బ తింది.
రిలీజ్ ముందు ‘పుష్ప’ను ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. డిసెంబరు 17న రిలీజైన ‘పుష్ప’ తర్వాతి వారం ‘83’ ధాటికి నిలవలేక థియేట్రికల్ రన్ ముగిస్తుందేమో అనుకుంటే.. దాని దెబ్బకు ‘83’ వసూళ్లు పడిపోయి అదే అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ ఉత్తరాదిన బాక్సాఫీస్‌ను ఏలుతూ హిందీ సినిమాలకు ఛాన్స్ లేకుండా చేస్తోంది.‘బాహుబలి’ లాగా ‘ఆర్ఆర్ఆర్’ మ్యాజిక్ చేయలేదని, దీనికంత సీన్ లేదని రిలీజ్ ముంగిట డల్లుగా సాగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూసి కామెంట్లు చేశారు కానీ.. విడుదల తర్వాత కథ మారిపోయింది.
బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు రేపుతున్న ‘కశ్మీర్ ఫైల్స్’ సైతం ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకు నెమ్మదించింది. అక్షయ్ కుమార్ సినిమా ‘బచ్చన్ పాండే’ గురించి అందరూ మరిచిపోయేలా చేసింది కూడా రాజమౌళి సినిమానే. అంతటితో ఆగకుండా రాబోయే కొత్త సినిమాలకు కూడా ఇది గండి కొట్టేలా కనిపిస్తోంది. ఏప్రిల్ 1న జాన్ అబ్రహాం సినిమా ‘ఎటాక్’ను పెద్ద ఎత్తునే రిలీజ్ చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ రాక ముందు వరకు ఆ చిత్ర నిర్మాతలు ధీమాగా ఉన్నారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజై రోజు రోజుకూ వసూళ్లు పెంచుకుంటూ పోతుండటంతో వారికిప్పుడు గుబులు పుడుతోంది.
ప్రస్తుతం హిందీ మార్కెట్లో మెజారిటీ థియేటర్లలో ‘ఆర్ఆర్ఆర్’యే ఆడుతోంది. మాస్ ఏరియాల్లో ఆ సినిమా వీక్ డేస్‌లోనూ మంచి వసూళ్లతో నడుస్తోంది. వీకెండ్లో సినిమా ఇంకా పుంజుకునేలా ఉంది. ‘ఎటాక్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోగా.. థియేటర్లలోకి దిగాక ‘ఆర్ఆర్ఆర్’ పోటీని ఏమాత్రం తట్టుకుంటుందో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ చిత్రంపై భారీగా పెట్టుబడులు పెట్టిన అందరిలోనూ ఇప్పుడు గుబులు పుడుతోంది. ఇగోకు పోకుండా సినిమాను వాయిదా వేసుకుంటే మంచిదన్న సలహాలు కూడా వినిపిస్తున్నాయి. కానీ మేకర్స్ ఏదైతే అయిందని ముందుకెళ్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 31, 2022 5:27 pm
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…