కరోనా టైంలో సినిమాల వాయిదా అన్నది చాలా మామూలు విషయం అయిపోయింది. ఒక డేట్‌కు కట్టుబడి సినిమాను రిలీజ్ చేస్తే అది చాలా గొప్ప విషయంగానే ఉంటోంది. గత రెండేళ్లలో వాయిదా పడని సినిమా అంటూ ఏదీ లేదు. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. మూణ్నాలుగుసార్లు వాయిదా పడుతున్నాయి సినిమాలు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్‌కు నాలుగుసార్లు డేట్ మారింది.
ఈ వేసవిలో వచ్చిన, రాబోతున్న సినిమాలన్నింటి పరిస్థితీ ఇంతే. ఈ వరుసలో ఇంకో సినిమా మళ్లీ డేట్ మార్చుకుంది. గోపీచంద్-మారుతిల కలయికలో తెరకెక్కిన పక్కా కమర్షియల్‌కు ముందు అనుకున్న డేట్ మార్చి 18. కానీ 25కు ఆర్ఆర్ఆర్ ఫిక్స్ కావడంతో మే 20కి వాయిదా వేశారు. ఆ డేట్‌తో పోస్టర్ రిలీజ్ చేసి.. కింద కరోనా కరుణిస్తే అనే రైడర్ కూడా పెట్టారు.
అప్పుడే అనుకున్నారు జనాలు.. ఈ డేట్ కూడా ఖాయం కాదని. ఇప్పుడు అదే జరిగింది. ఈ సినిమాను మళ్లీ వాయిదా వేసి కొత్త డేట్ ఇచ్చారు. జులై 1న పక్కా కమర్షియల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈసారి ఇచ్చిన డేట్ మాత్రం పక్కా అనే అంటున్నారు. మే 13న మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట రిలీజవుతున్న నేపథ్యంలో ఇంకో వారానికి గోపీచంద్ సినిమాను విడుదల చేసే సాహసం చేయకపోవచ్చనే అనుమానాలు ముందు నుంచే ఉన్నాయి.
ఇప్పుడు ఆ అనుమానాలే నిజం అయ్యాయి. జులై 1న మాధవన్ బహు భాషా చిత్రం రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్ కూడా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. పక్కా కమర్షియల్ మూవీలో గోపీ లాయర్ పాత్రలో నటించాడు. అతడికి జోడీగా రాశి ఖన్నా కనిపించనుంది. యువి క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.
This post was last modified on March 31, 2022 7:41 am
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…