ప్రపంచ సినిమాలో హాలీవుడ్‌కు ఉన్న ప్రాధాన్యం వేరు. ఆ సినిమాల బడ్జెట్లు, వాటి వసూళ్లతో అసలు పోలికే ఉండదు. ఏ సినిమా అయినా వందల కోట్ల బడ్జెట్లోనే తెరకెక్కుతుంది. వేల కోట్ల వసూళ్లు అలవోకగా సాధించేస్తుంటుంది. అయితే ఇదంతా అక్కడి దర్శకులు, నటీనటుల గొప్పదనమేమీ కాదని అంటున్నాడు టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ఈ ఘనతంగా ఇంగ్లిష్ భాషకే చెందుతుందని అతను అభిప్రాయపడ్డాడు.
తన కొత్త చిత్రం జనగణమన ప్రారంభోత్సవం సందర్భంగా ముంబయిలో మీడియాతో మాట్లాడిన అతను.. ఈ వ్యాఖ్యలు చేశాడు. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి ప్రాంతీయ చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటడం గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు విజయ్ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. అసలు ఈ చిత్రాలను పాన్ ఇండియా సినిమాలు అనకూడదని.. ఇవి ఇండియన్ సినిమాను రిప్రజెంట్ చేస్తున్నాయని విజయ్ వ్యాఖ్యానించాడు.
బాహుబలి సినిమా ప్రాంతీయ చిత్రాలకు ఉన్న పరిధులను దాటి దేశవ్యాప్తంగా అద్భుత విజయం సాధించిందని, అంతకుముందు కూడా పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కినప్పటికీ.. తనకు తెలిసినంత వరకు ఇది హద్దులన్నీ చెరిపేసిందని, ఎవరైనా ఇలాంటి సినిమాలు తీయొచ్చని, కాబట్టే తాను పాన్ఇండియా సినిమాలు చేస్తూ, ఈ రోజు ముంబయిలో కూర్చుని మాట్లాడుతున్నానని విజయ్ అన్నాడు. ఇక హాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడుతూ.. అక్కడి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మన వాళ్ల కంటే గొప్పవాళ్లేమీ కాదని.. ఐతే ప్రపంచంలో ఎక్కువమంది ఇంగ్లిష్ మాట్లాడటం వల్ల ఇంగ్లిష్ సినిమాలు కూడా ఎక్కువగా చూస్తారని.. కాబట్టే అక్కడ ఎక్కువ బడ్జెట్లలో సినిమాలు తెరకెక్కడమే కాక ఎక్కువ వసూళ్లు కూడా రాబడతాయని అంతకుమించి తేడా ఏమీ లేదని విజయ్ అభిప్రాయపడ్డాడు.
చైనా జనాభా ఎక్కువ కావడంతో ఇప్పుడు హాలీవుడ్ వాళ్లు ఆ దేశ ఫిలిం మేకర్స్‌తో భాగస్వాములవుతున్నారని.. ఇండియన్ సినిమా ఇలాగే సత్తా చాటుతూ పోతే రేప్పొద్దున మనతోనూ వాళ్లు భాగస్వాములవుతారని విజయ్ అన్నాడు. విజయ్ చెప్పిన లాజిక్ భలేగా అనిపించడమే కాక.. కరెక్టే కదా అన్న ఫీలింగ్ కలిగిస్తోంది జనాలకి.
This post was last modified on March 30, 2022 9:49 am
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…