సినిమాలో నీకు ఒక పెద్ద రోల్ ఇస్తానంటూ చెప్పి, ఆ తరువాత ఆ రోల్ ను కుదించేస్తే.. బాలీవుడ్ బ్యూటి ఆలియా భట్ అలిగినా కూడా ఒక అర్ధం ఉంది. కాని అన్నీ తెలిశాక కూడా అడిగి మరీ రోల్ చేస్తానంటూ ముందుకొచ్చిన భామ అలిగితే మీనింగ్ ఉందా? సరిగ్గా ఇప్పుడు మన గంగూబాయ్ విషయంలో ఇదే టాక్ వినిపిస్తోంది. మరీ వింతగా ప్రవర్తించడం అనేది కాస్త వింతగానే ఉంది.
నిజానికి ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం ఒక హీరోయిన్ ను వెతుకుతున్న వేళ.. రాజమౌళికి ఎయిర్ పోర్టులో కనిపించిన ఆలియా.. తనకు ఏదన్నా అవకాశం ఇవ్వాల్సిందిగా కోరిందట. తన తదుపరి సినిమాలో ఓ చిన్న రోల్ ఉందని చెబితే, చిన్నదైనా పర్లేదు చేసేస్తా అంటూ రంగంలోకి దూకేసింది. ఫుల్ సినిమాకు తీసుకునే పారితోషకమే పుచ్చుకుని, ఇప్పుడు మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్ ఇవ్వలేదని అలిగింది.
అంతే కాదు, కనీసం రిలీజ్ నుండి ఒక్కసారి కూడా సినిమాను ప్రమోట్ చేసిందేలేదు. బాలీవుడ్ జనాలందరూ వావ్ వండర్ఫుల్ అంటున్నా కూడా, ఆలియా మాత్రం నోరు మెదపట్లేదు. చివరకు ఇనస్టా స్టోరీలో తూతూమంత్రంగా ఆర్.ఆర్.ఆర్. అంటూ ఒక పోస్టర్ షేర్ చేసింది. అది కూడా సినిమా రిలీజైన మూడు రోజుల తరువాత. అసలు ఏరి కోరి ఈ రోల్ తీసుకున్నాక ఈ అలకెందుకు ఆలియా?
ఇక్కడ మ్యాటర్ ఏంటంటే.. ఆలియా చేస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాకు రాజమౌళి ప్రెజంటర్ గా వ్యవహరిస్తున్నాడు. పైగా ఈ సినిమా లోగో లాంచ్ సమయంలో ఆలియా త్వరలో పెళ్ళి చేసుకోబోయో హీరో రణబీర్ కపూర్ ఏకంగా ఆయన కాళ్ళకు మొక్కేశాడు. మరి రేపొద్దున్న బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్లో రాజమౌళి ఫేస్ చూసి ఏం సమాధానం చెబుతుందో ఈ హాట్ హీరోయిన్. అప్పుడు మీడియావాళ్ళు ఈ అలక మ్యాటర్ ను అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. స్టార్ హీరోయిన్ గా ఎదిగాక కూడా ఇలా చిన్నపిల్లల్లా బిహేవ్ చేయడమంటే.. ఆలియాకు చెల్లుతోంది మరి.
This post was last modified on March 30, 2022 8:56 am
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…