Movie News

కొత్త సినిమా ఎప్పుడో చెప్పిన తారక్

ఆర్ఆర్ఆర్ కోసం మూడున్నరేళ్లకు పైగా సమయాన్ని వెచ్చించాడు జూనియర్ ఎన్టీఆర్. రాజమౌళితో సినిమా అంటే ఆలస్యం మామూలే కానీ.. తారక్ మరీ ఇంత సమయం పెడతాడని అభిమానులు ఊహించలేదు. చరణ్ కూడా ఈ సినిమా కోసం తన కెరీర్లో విలువైన సమయాన్ని వెచ్చించాడు కానీ.. తారక్‌తో పోలిస్తే అతను నయం. ‘ఆర్ఆర్ఆర్’ మొదలవుతున్న టైంలోనే ‘వినయ విధేయ రామ’తో పలకరించాడు.

మధ్యలో ‘ఆచార్య’ సినిమాలో కీలక పాత్ర చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తవగానే ఆలస్యం చేయకుండా శంకర్ సినిమాను మొదలుపెట్టేశాడు. కానీ తారక్ మాత్రం గత మూడున్నరేళ్లలో వేరే సినిమా పని ఏదీ చేయలేదు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ కొరటాలతో అనుకున్న కొత్త చిత్రాన్ని ఇప్పటిదాకా మొదలుపెట్టలేదు.

ఇదిగో అదిగో అనుకుంటూనే నెలలకు నెలలు గడిచిపోయాయి. తారక్-కొరటాల సినిమా ఎంతకీ పట్టాలెక్కకపోవడం అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు డెడ్ లైన్లు మారుతుండటంతో ఏదీ నమ్మే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఐతే ఎట్టకేలకు తారక్ స్వయంగా ఈ విషయంలో అభిమానులకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

కొరటాలతో తన కొత్త చిత్రం జూన్లో సెట్స్ మీదికి వెళ్తుందని తారక్ ప్రకటించాడు. ఈ సినిమా కోసం తాను సన్నాహాలు మొదలుపెట్టినట్లు కూడా వెల్లడించాడు. ‘ఆర్ఆర్ఆర్’తో పోలిస్తే ఇందులో తారక్ లుక్ పూర్తి భిన్నంగా, ఆధునికంగా ఉండబోతోంది. ఇదొక రివెంజ్ డ్రామా అని, ఎన్టీఆర్ లుక్ పరంగా సర్ప్రైజ్ ఉంటుందని అంటున్నారు. ఏప్రిల్ 29న ‘ఆచార్య’ రిలీజవుతుండటంతో ఆ తర్వాత ఇంకో వారానికి కొరటాల పూర్తిగా ఫ్రీ అయిపోతాడు. ఇప్పటికే తారక్ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులను అతను పర్యవేక్షిస్తున్నాడు. స్క్రిప్టు ముందే పూర్తయింది. ఈ చిత్రాన్ని కొరటాల మిత్రుడైన మిక్కిలినేని సుధాకర్, తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్ కలిసి నిర్మించనున్న సంగతి తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడని సమాచారం.

This post was last modified on March 29, 2022 8:58 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

3 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

5 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

5 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

5 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

9 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

9 hours ago