Movie News

ఓటీటీ రిలీజ్.. చేతులు దులుపుకుంటున్నారా?

మరో సినిమా నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో రిలీజైంది. ఫలితంలో ఏ మార్పూ లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కీర్తి సురేష్ సినిమా ‘పెంగ్విన్’ తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆహా ఓహో అన్నట్లు ట్రైలర్ కట్ చేసి జనాల్లో ఆసక్తి పెంచిన చిత్ర బృందం.. సినిమాను తేల్చి పడేసింది. ఇలాంటి సీరియల్ కిల్లర్ కథలు బోలెడు చూశాం.

ఇక సినిమా చివర్లో ట్విస్టు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కాస్తో కూస్తో సినిమాపై ఉన్న మంచి ఇంప్రెషన్‌ను అది ఇంకా తగ్గించేసింది. సినిమా చూసిన వాళ్లు రెండు గంటలు టైం వేస్ట్ అని తిట్టి పోస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ లాంటి దర్శకుడు ఈ సినిమాను ఎలా సమర్పించాడు.. కీర్తి సురేష్ ఈ చిత్రాన్ని ఎలా ఒప్పుకుంది అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అసలే ఓటీటీల్లో రిలీజవుతున్న సినిమాలు వరుసగా ఫెయిలవుతుండటంతో వాటి పట్ల ఒక నెగెటివ్ ఫీలింగ్ పడిపోయింది.

ఇప్పుడు ‘పెంగ్విన్’ లాంటి పేరున్న సినిమా కూడా వాటి కోవలోకే చేరడంతో ఈ విషయంలో నెగెటివిటీ మరింత పెరిగిపోయేలా కనిపిస్తోంది. బడ్జెట్ మీద లాభానికి రేటు ఇచ్చి సినిమాలు కొని నేరుగా రిలీజ్ చేస్తున్న ఓటీటీ సంస్థలు పునరాలోచనలో పడేలా చేస్తున్నాయి ఈ చిత్రాలు. చూస్తుంటే.. బాక్సాఫీస్ రిజల్ట్ మీద భరోసా లేని నిర్మాతలే ఇలా ఓటీటీల్లో తమ సినిమాల్ని రిలీజ్ చేసి చేతులు దులుపుకుంటున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

నిజంగా సినిమా థియేటర్లలో బాగా ఆడుతుంది, బాగా డబ్బులు తెచ్చిపెడుతుంది అన్న నమ్మకం ఉంటే అంత సులువుగా ఓటీటీ రిలీజ్‌కు నిర్మాతలు ఒప్పుకోరు. రెడ్, వి లాంటి సినిమాలకు మంచి ఆఫర్లు వచ్చినా ఆయా నిర్మాతలు ఓటీటీ రిలీజ్‌కు ఒప్పుకోలేదు. వీటిని పక్కన పెడితే భాషతో సంబంధం లేకుండా ఓటీటీల్లో రిలీజవుతున్న సినిమాలన్నీ తుస్సుమంటుండటంతో వాటి పట్ల ప్రేక్షకుల్లో నెగెటివ్ ఫీలింగ్ పడుతోంది. ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయడం వల్ల తమకేంటి ప్రయోజనం అని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పునరాలోచనలో పడుతున్నాయి. మరి ఈ ఒరవడికి బ్రేక్ వేసే సినిమా ఏదో చూడాలి.

This post was last modified on June 20, 2020 3:54 pm

Share

Recent Posts

మెగా సక్సెస్ స్ట్రీక్… చెప్పి మరీ కొట్టాడు

ఏడాది వెనక్కి వెళ్తే మెగా ఫ్యామిలీ హీరోల పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. అల్లు అర్జున్‌ను పక్కన పెట్టేస్తే.. మెగాస్టార్…

10 minutes ago

బాలినేని వైసీపీ కోసం పని చేస్తున్నారా?

బాలినేని శ్రీనివాసరెడ్డి... వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమీప బంధువు. జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డికి మరింత…

9 hours ago

స్టార్ల మల్టీప్లెక్సులు… ఆదాయానికి కొత్త దారులు

వైజాగ్ లో అల్లు ఫ్యామిలీ, ఏషియన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన 8 స్క్రీన్ల ఏఏఏ మల్టీప్లెక్స్ అఫీషియల్ గా లాంచయ్యింది.…

9 hours ago

డాక్టర్ కావాలనే ప్రియాంక కల… కలగానే మిగిలిపోయింది..!

ఏపీలోని రాజమహేంద్రవరం నగరంలో ఇటీవల చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ కేసు ఆదివారం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో…

11 hours ago

వీరభద్రుడి ఒత్తిడి విశ్వనాథ్ మీద ఉంటుందా

వచ్చే వారం విడుదలవుతున్న సినిమాల్లో విశ్వనాథ్ అండ్ సన్సే పెద్దది. తమిళ డబ్బింగ్ అయినప్పటికీ తీసింది సితార ఎంటర్ టైన్మెంట్స్…

12 hours ago

హీరోయిన్‌కు అభిమాని లిప్ కిస్

పబ్లిక్‌లోకి వచ్చే సెలబ్రెటీలతో సామాన్య జనం కొన్ని సందర్భాల్లో హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. తమ అభిమాన కథానాయకులు, కథానాయికలను చూసిపుడు…

16 hours ago