ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ ఏడాది అత్యధిక అంచనాలతో వస్తున్న సినిమా కేజీఎఫ్-2నే. మూడేళ్ల కిందట కేజీఎఫ్-1 సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ కన్నడ సినిమా కర్ణాటక అవతల రిలీజ్ కావడమే గగనం అంటే.. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో భారీ వసూళ్లు రాబట్టి పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అయింది.
ఇక అప్పట్నుంచి చాప్టర్-2 కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అసలే సినిమాపై అంచనాలు భారీగా ఉండగా.. గత ఏడాది రిలీజ్ చేసిన టీజర్ చూశాక అవి ఇంకా పెరిగిపోయాయి. ముఖ్యంగా టీజర్ చివర్లో రాకీ భారీ తుపాకీతో విధ్వంసం సృష్టించి దాన్నుంచే సిగరెట్ ముట్టించుకునే షాట్ పూనకాలు తెప్పించేసింది మాస్ ప్రేక్షకులకు. అప్పట్నుంచి టీజరే ఇలా ఉంటే.. ట్రైలర్ ఇంకెలా ఉంటుందో అన్న ఉత్కంఠ మొదలైంది. ట్రైలర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.
ఐతే ఎట్టకేలకు నిరీక్షణకు తెరదించుతూ ఆదివారం కేజీఎఫ్-2 ట్రైలర్ లాంచ్ చేశారు. అందులో విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అనే అనిపించినా.. ఓవరాల్‌గా ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు లేదనే అభిప్రాయం మెజారిటీ ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా పోల్స్ అన్నింట్లోనూ ట్రైలర్ గురించి నెగెటివ్‌గానే స్పందిస్తున్నారు. ముఖ్యంగా రాకీ-అధీర మధ్య ఫేసాఫ్ షాట్లేవీ లేకపోవడం.. టీజర్లో మాదిరి మైండ్ బ్లోయింగ్ మాస్ మూమెంట్ మిస్ అవడం ట్రైలర్‌కు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడానికి కారణమయ్యాయి. ఐతే దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు ట్రైలర్ కట్ చేసేటపుడు ఈమాత్రం ఐడియా ఉండి ఉండదా.. సినిమా నుంచి అలాంటి షాట్లు పెట్టలేకపోయాడా అన్న చర్చ నడుస్తోందిప్పుడు.
ట్రైలర్లో అన్నీ చూపించేస్తే హైప్ ఇంకా పెరిగిపోతుందని.. రేప్పొద్దున సినిమా చూసినపుడు ఏమైనా తగ్గితే, కొత్త మెరుపులేమీ లేకుంటే, సర్ప్రైజ్‌లు తగ్గితే ప్రేక్షకులు డిజప్పాయింట్ కావచ్చొని.. అందుకే సినిమా కోసం చాలా దాచి ఉంటాడని, ఓవర్ హైప్ కూడా మంచిది కాదేమో అన్న ఉద్దేశంతో ఇలా చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూద్దాం మరి సినిమాతో అతనెంత సర్ప్రైజ్ చేస్తాడో?
This post was last modified on March 29, 2022 6:53 am
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…