ఇప్పుడు ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా రాజమౌళి పేరు చెప్పేయొచ్చు. ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే దాన్ని కెరీర్లోనే అతి పెద్ద ఛాన్సుగా భావిస్తున్నారు హీరోలు. జక్కన్నకు ఇప్పుడున్న క్రేజ్, మార్కెట్ హీరోలకు బాగా ప్లస్ అవుతోంది. ఆయనతో సినిమా అంటే ఆషామాషీగా ఉండట్లేదు. తన స్థాయికి తగ్గట్లు సినిమా తీసి సరిగా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తే దేశవ్యాప్తంగా వసూళ్ల మోత మోగిపోతోంది.
దీంతో ఆ హీరో రేంజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోతోంది. పాన్ ఇండియా స్టార్లు అయిపోతున్నారు. కాబట్టే జక్కన్నతో సినిమా చేయడానికి హీరోలు తహతహలాడిపోతున్నారు. బాలీవుడ్, కోలీవుడ్ సూపర్ స్టార్లకు కూడా మన దర్శక ధీరుడితో సినిమా చేయాలని ఉంది. కానీ వేరే భాషల హీరోలు మన స్టార్లలా జక్కన్నకు సరెండర్ అవుతారా అన్నదే ప్రశ్న.
బాహుబలి కోసం ప్రభాస్ ఐదేళ్లు వెచ్చిస్తే.. ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ తలో మూడున్నరేళ్లు సమయం పెట్టారు. ఆ స్థాయి హీరోలు వేరే కమిట్మెంట్లు పెట్టుకోకుండా ఇలా సుదీర్ఘ కాలం ఒక సినిమాకు కట్టుబడి ఉండటం అంత తేలికైన విషయం కాదు. కొన్ని నెలలు సినిమా వాయిదా పడితే, వేరే సినిమాలు వెనక్కి వెళ్తేనే కష్టమవుతుంది. అలాంటిది ఏళ్లకు ఏళ్లు ఆలస్యం జరిగితే తలెత్తే ఇబ్బంది అంతా ఇంతా కాదు. జక్కన్నతో సినిమా అంటే కుటుంబాలుండవు. ఎన్నో త్యాగాలు చేయాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండాలి.
ఆయనకు దగ్గరగా ఉండాలి కూడా. అలుపు, విసుగు, అలకలు లేకుండా పని చేయాలి. జక్కన్న ఎంత గొప్ప దర్శకుడైనప్పటికీ.. మన లోకల్ హీరోలతో ఆయనకున్న కంఫర్ట్ వేరు. వారితో వ్యక్తిగత స్నేహం, ఇతర సౌలభ్యాలు ఆయనకు ప్లస్ అవుతాయి. హీరోలతో ఏ రకమైన తలనొప్పి ఉండదు. వాళ్లు పూర్తిగా ఆయనకు సరెండర్ కావడం, ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఎంత కష్టానికైనా, ఏం చేయడానికైనా రెడీగా ఉండటం వల్ల జక్కన్న గొప్ప ఔట్ పుట్ ఇవ్వగలుగుతున్నాడు. కానీ వేరే భాషా హీరోలతో ఆయనకు కచ్చితంగా ఈ సౌలభ్యాలేవీ ఉండవు. ఏదో ఆర్ఆర్ఆర్‌లో అజయ్ దేవగణ్ లాగా కొన్ని రోజులు డేట్లు కేటాయించి అతిథి పాత్రలు చేయడం వరకు అయితే ఓకే కానీ.. వేరే కమిట్మెంట్లన్నీ పక్కన పెట్టి ఏళ్లకు ఏళ్లు ప్రభాస్, తారక్, చరణ్‌ల మాదిరి వేరే భాషల హీరోలు జక్కన్న కోసం టైం పెడతారా అన్నది డౌటే.
This post was last modified on March 27, 2022 1:14 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…