ఈ ప్రపంచంలో అమ్మకాలు కొనుగోళ్లు ఏవైనా సరే.. డిమాండ్ అండ్ సప్లై ఆధారంగానే నడుస్తాయన్నది తెలిసిన విషయమే. కర్ణాటకలో తెలుగు సినిమాలకు ఉన్న డిమాండ్ సంగతి తెలిసిందే. ఏదైనా భారీ తెలుగు చిత్రం రిలీజవుతుంటే.. దానికి పోటీగా కన్నడ సినిమాలను రిలీజ్ చేయడానికి భయపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రం రెండు రోజుల కిందటే కన్నడ నాట భారీ స్థాయిలో రిలీజైంది.
ఐతే ఆ టైంలో కన్నడిగులు ఈ సినిమాను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో ఉద్యమం నడపడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కన్నడలో రిలీజ్ చేయకుండా కేవలం తెలుగు వెర్షన్‌కే బుకింగ్స్ నడిపిస్తున్నారని.. అందుకుని ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని కన్నడిగులకు సోషల్ మీడియా ఉద్యమ కారులు పిలుపునిచ్చారు. ఐతే డిస్ట్రిబ్యూటర్ వెంటనే జోక్యం చేసుకుని ఆర్ఆర్ఆర్ కన్నడ వెర్షన్ కోసం కొన్ని స్క్రీన్లు కేటాయించారు. కానీ ఈ చిత్రాన్ని కన్నడలో అక్కడి వాళ్లు ఎగబడి ఏమీ చూసేయడం లేదు.
కన్నడ వెర్షన్‌కు డిమాండ్ అనుకున్నంతగా లేదు. ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కావడానికి ముందు వారం దివంగత పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా జేమ్స్‌ను భారీ స్థాయిలో విడుదల చేయడం తెలిసిన సంగతే. కర్ణాటకలో ఉన్న దాదాపు అన్ని థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. తొలి వారం అక్కడి ప్రేక్షకులు విరగబడి ఈ సినిమా చూశారు. రికార్డు స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ఐతే తర్వాతి వారం ఆర్ఆర్ఆర్ రావడంతో జేమ్స్‌కు డిమాండ్ లేకపోయింది. చూడాల్సిన వాళ్లంతా చూసేశారు. పైగా ఆర్ఆర్ఆర్ మీద అందరి దృష్టి పడింది.
ఆ సినిమా స్క్రీన్లకు, షోలకు, టికెట్లకు బెంగళూరు సహా ప్రధాన నగరాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఐతే ఆల్రెడీ కర్ణాటకలో పర భాషా చిత్రాల ఆధిపత్యం పట్ల కన్నడిగులు అసంతప్తితో ఉండటంతో తమకు అత్యంత ప్రియమైన పునీత్ సినిమాను తీసేసి ఆర్ఆర్ఆర్‌ను వేస్తే ఎక్కడ వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందో అని వసూళ్లు గొప్పగా లేకపోయినా ఆ సినిమాకు పెద్ద సంఖ్యలో థియేటర్లను కొనసాగిస్తున్నారు. ఓవైపు వీకెండ్లో ఆర్ఆర్ఆర్‌కు మరింతగా స్క్రీన్లు, వసూళ్లు పెంచుకునే అవకాశం ఉన‌్నా.. జేమ్స్ కారణంగా దీనికి స్కోప్ లేకపోయింది. బాహుబలి-2 కర్ణాటక వసూళ్లను తొలి రోజు ఆర్ఆర్ఆర్ కొట్టలేకపోవడానికి కూడా ఇదే కారణం.
This post was last modified on March 27, 2022 1:06 pm
కంగువ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రెండు వేల కోట్లు వసూలు…
టాలీవుడ్ లోనే కాదు అటు ఉత్తరాదిలోనూ మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీగా విపరీతమైన అంచనాలు మోస్తున్న పుష్ప 2…
సెలబ్రెటీలు ఏం చేసినా వార్తే. అలాంటిది ఒక స్టార్ హీరో వైన్ షాపుకి వెళ్లి మద్యం కొంటే అంతకంటే వార్త…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రానికి డాకు మహారాజ్ టైటిల్ నిర్ణయించారు. ఈ లీక్…
పాపం దురదృష్టాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నట్టు ఉంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి. రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా…
ఇద్దరి హీరోల అభిమానులు ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ 4 బాలకృష్ణ, బన్నీల ఇంటర్వ్యూలో మొదటి భాగం నిన్న అర్ధరాత్రి…