తన సినిమాల విడుదలకు ముందే వాటి కథలేంటో చూచాయిగా వెల్లడించేయడం రాజమౌళికి అలవాటు. ఈగ సినిమా మొదలైన రోజే దాని కథ చెప్పేసి ఆ తర్వాత షూటింగ్‌కు వెళ్లడం జక్కన్నకే చెల్లింది. తన కొత్త చిత్రం ఆర్ఆర్ఆర్ విషయంలోనూ ఇదే చేశాడు. ఈ సినిమా ఆరంభ దశలో ఉండగానే ప్రెస్ మీట్ పెట్టి ఈ కథ ఎలా ఉంటుందో.. ఇందులోని ముఖ్య పాత్రల తీరు తెన్నులేంటో ఆయన చెప్పేశాడు.
చరణ్ చేస్తున్నది అల్లూరి సీతారామరాజు పాత్రని.. తారక్ పోషిస్తున్నది కొమరం భీమ్ పాత్ర అని వెల్లడించాడు. ఆ ప్రెస్ మీట్ విశేషాలను నార్త్ మీడియా వాళ్లు కూడా కవర్ చేశారు. ఇక రిలీజ్ ముంగిట ప్రమోషన్లలో కూడా హీరోలిద్దరి పాత్రల గురించి వివరంగా మాట్లాడాడు జక్కన్న. ఇంత క్లారిటీ ఇచ్చినా కూడా ఉత్తరాది ప్రేక్షకులు సినిమాలో రామ్ చరణ్ పాత్రను ఇంకోలా అర్థం చేసుకుంటుండటం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఆర్ఆర్ఆర్ రిలీజైన దగ్గర్నుంచి రామ్ చరణ్ చేసింది రాముడి పాత్ర అని బలంగా నమ్ముతున్నారు ఉత్తరాది ప్రేక్షకులు. ఆ పాత్ర పేరు రామ్ కాగా.. క్లైమాక్సులో అది అల్లూరి సీతారామరాజు అవతారంలోకి మారుతుందన్న సంగతి తెలిసిందే. నిజానికి జక్కన్న ముందు నుంచి చెబుతున్నట్లు ఇది అల్లూరి పాత్ర కాదు. క్లైమాక్స్ దగ్గర ఆ అవతారంలోకి మారుతుందతంతే. చరిత్ర పేరు చెప్పి జక్కన్న తనకు నచ్చినట్లు కథను.. పాత్రల్ని అల్లేసుకున్నాడు. ఈ విషయంలో అభ్యంతరాలు ఎదురైనా పట్టించుకోవట్లేదు.
ఆ సంగతలా ఉంచితే.. సినిమా రిలీజైన దగ్గర్నుంచి రామ్ చరణ్ చేసింది రాముడి పాత్రే అని తెగ ప్రచారాలు చేసేస్తున్నారు నార్త్ ఆడియన్స్. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ రాముడిని, హిందూ దేవుళ్లను కించపరిచేలా సినిమాలు తీస్తుంటే రాజమౌళి చూశారా అంటూ ఆయన్ని కొనియాడుతున్నారు. ఇంతకముందు రాజమౌళి స్వయంగా అల్లూరి గురించి ప్రస్తావించినా.. ఇప్పుడు మన నెటిజన్లు అల్లూరి గురించి, ఆయన చరిత్ర గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నా వాళ్లు పట్టించుకోవట్లేదు. ఇంతకముందు అఖండ సినిమాను లేపినట్లే ఆర్ఆర్ఆర్‌ను లేపుతూ ఎలివేషన్లు ఇస్తున్నారు. ఏదేమైతేనేం సినిమాకు ఇది బాగానే కలిసొస్తుండటంతో చిత్ర బృందం సైలెంటుగా ఉంది.
This post was last modified on March 27, 2022 11:34 am
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…