నిజానికి బాహుబలి సినిమాకు హిందీలో భారీగా రీచ్చ వచ్చిందంటే.. దానికి ప్రధాన కారణం ప్రభాస్, కంటెంట్, మ్యూజిక్.. ఇవేం కాదు. అప్పట్లో మెగా నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను తన సొంత సినిమాలా ఫీలై, దానిని విపరీతంగా ప్రమోట్ చేయించాడు. ఆయన స్ట్రాటజీ దెబ్బకి సినిమాకు భారీగా ఎలివేషన్ వచ్చేసింది.
ఇక రెండో భాగం రిలీజు టైముకు కరణ్ కు సినిమాలో సరైన వాటా ఇవ్వలేదని, అందుకే మనోడు చివర్లో ప్రమోషన్లకు హ్యాండిచ్చాడని చాలా టాక్స్ నడిచాయ్. ఏదేమైనా.. ఆర్ఆర్ఆర్ కోసం అస్సలు సీన్లోకి రానేరాలేదు కరణ్ జోహార్. కాని సౌత్ కంటెంట్ ను అంత తేలికగా ఎలా వదిలేస్తాడు.
అందరూ అనుకున్నట్లే సౌత్ నుండి వచ్చే ఇతర పెద్ద సినిమాల మీద ఫోకస్ చేశాడు కరణ్ జోహార్. ఒక ప్రక్కన మలయాళం హిట్ సినిమా ‘హృదయం’ ను కొనేశాడు. ఇంకో ప్రక్కన.. అసలు బాహుబలి 2 సినిమాను కొట్టే సత్తా ఉన్న నాన్-రాజమౌళి చిత్రంగా పాపులర్ అవుతున్న కె.జి.ఎఫ్ ఛాప్టర్ 2 మీద కన్నేశాడు.
ఆ సినిమాకు హిందీలో తనే ‘ప్రెజంట్స్’ కార్డు వేసుకుని మరీ ధియేటర్లలో దింపుతున్నాడు. ఏప్రియల్ రెండవ వారంలో రిలీజ్ ఉండటంతో.. ఆ సినిమాను జనాలకు చేరువ చేసే పనిలో పడ్డాడు కరణ్ జోహార్. మొత్తానికి రాజమౌళి పక్కన పెడితే తన స్టయిల్లో తను కొత్త రూటు వెతుక్కోవడం ఈ బాలీవుడ్ నిర్మాతకే చెల్లింది.
మరో ప్రక్కన కరణ్ జోహార్ హిందీలో డైరక్టుగా తీస్తున్న సినిమాలేవి ఈ మధ్యన పెద్దగా ఆడట్లేదు. పెద్ద బడ్జెట్ సినిమాలైనా చిన్న సినిమాలైనా కూడా ఎందుకో కరణ్ మార్క్ మిస్సవుతోంది. అయితే తన నిర్మాణ్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ మాత్రం గత ఏడాదిలో షేర్షా, సూర్యవన్షి, గెహ్రాయియాన్ వంటి సినిమాలతో డబ్బులు, పేరు రెండూ సంపాదిస్తోంది.
మరో ప్రక్కన కరణ్ జోహార్ కూడా ఇప్పుడు దక్షిణాదిలో తన నిర్మాణ సంస్థతో కొన్ని సినిమాలు తీయించాలనే యోచనలో ఉన్నాడు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాలకు వస్తున్న భారీ షేర్ వసూళ్ళు చూశాక.. ఆ మాత్రం మనస్సు పాడేసుకోకుండా ఎలా ఉంటాడు.
This post was last modified on March 26, 2022 5:13 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…