బాలీవుడ్ వెళ్లి అక్కడే పెద్ద హిట్టు కొట్ట అక్కడే స్థిరపడాలని చాలామంది నార్త్ భామలు కలలుగంటూనే ఉంటారు. తెలుగులో మంచి స్టార్డమ్ వచ్చినా కూడా, ముంబాయ్ లో పెద్ద హీరోయిన్లు అయిపోవాలని వీరు ఆలోచిస్తుంటారు.
ఇలియానా, తమన్నా, కాజల్.. ఇలా అందరూ ఇక్కడ పెద్ద స్టార్లు అయ్యాక ముంబాయ్ లో తిరిఇ అడుగుపెట్టారు. కాకపోతే వర్కవుట్ కావట్లేదని తెలుసుకుని కాజల్, తమన్నా మళ్ళీ తెలుగుకు తిరిగొస్తే.. ఇలియానా మాత్రం అక్కడే ఉండిపోయింది. ఫ్లాపైనా కూడా ఇటైతే తిరిగి రావాలని అనుకోలేదు. కొన్న సంవత్సరాల తరువాత వచ్చిన పెద్దగా వర్కవుట్ కాలేదులే. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇదే మీటర్లో ఉంది.
తెలుగులో వరుసపెట్టి పెద్ద పెద్ద సినిమాలు పడుతున్నప్పుడు.. ఇక్కడే ఉండి సూపర్ స్టార్డమ్ తెచ్చుకుంటుందేమో అనుకుంటే, రకల్ మాత్రం బొంబాయ్ ఫ్లయిట్ ఎక్కేసింది. ఇప్పటివరకు అక్కడ ఒక్క హిట్టు కూడా కొట్టకపోయినా కూడా ఒక అరడజను సినిమాలు చేసింది. హిట్టయిన అజయ్ దేవగన్ ‘దే దే ప్యార్ దే’ సినిమాలో అమ్మడికి సెక్సీగా కనిపించే ఒక్క సాంగ్ తప్పించి కనీసం టాలెంట్ చూపించే సరైన్ సీన్ ఒక్కటీ లేదు. ఇంకో నాలుగైదు చేతిలో ఉన్నాయ్ కూడా. ఇకపోతే అమ్మడు మరో వారంలో ‘ఎటాక్’ సినిమాతో ఎటాక్ ఇస్తోంది.
మార్చి 25న రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ వస్తోందని తెలిసినా కూడా, బాలీవుడ్ సినిమా ‘ఎటాక్’ మాత్రం ఏప్రియల్ 1న రావడానికే డిసైడైపోయింది. ఈ సినిమాలో జాన్ అబ్రహాం ఒక సోల్జర్ పాత్రలో నటిస్తుంటే, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ మరియు రకుల ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కంటెంట్ పరంగా ట్రైలర్ చూస్తే బాగానే ఉందిలే కాని, ఇలాంటి సైన్స్ ఫిక్షన్ మిలటీరి సినిమాలో ఎంతవరకు క్లిక్ అవుతాయనేది మాత్రం చెప్పలేం. ఒకవేళ సినిమా హిట్టయినా, ఆర్ఆర్ఆర్ వేవ్ లో నిలబడినా కూడా.. రకుల్ కు ఎంతవరకు ఈ సినిమా వలన ప్లస్సవుతుందో చూడాలి. ఆల్రెడీ పాటలూ అవీ చూస్తుంటే జాక్వెలైన్ రోల్ బాగున్నట్లు అనిపిస్తోంది.
This post was last modified on March 26, 2022 5:11 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…