ఆల్రెడీ భీమ్లా నాయక్ సినిమా రిలీజై చాలారోజులైంది. ఎప్పుడైతే ప్రభాస్ రాధేశ్యామ్ ధియేటర్లలోకి వచ్చిసిందో, పవన్ కళ్యాణ్ సినిమాను చాలా చోట్ల తీసేశారు. కాకపోతే ప్రభాస్ సినిమా రిజల్ట్ తేడ పడటంతో, కొన్ని మాస్ సెంటర్లలో భీమ్లాను తిరిగిదించక తప్పలేదు.
ఇకపోతే ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ కొనుక్కున్న డిస్నీ+హాట్ స్టార్ వాళ్లు మాత్రం.. ఎట్టి పరిస్థితులో ఆర్ఆర్ఆర్ కంటే ఒక్క రోజు ముందే సినిమాను ఓటిటి స్పేస్ లోకి తీసుకురావాలని ఫిక్సయ్యారు. దానితో మార్చి 25న ఆర్ఆర్ఆర్ రావడంతో, 24నే వీళ్లు సినిమాను హాట్ స్టార్ మరియు తెలుగు యాప్ ఆహాలో రిలీజ్ చేశారు.
అయితే ఈ సినిమాను ఓటిటిలో ఉందని జనాలకు ఎలా తెలుస్తుంది? నిజానికి భీమ్లా నాయక్ రేంజ్ సినిమా ఓటిటి రిలీజ్ గురించి జనాలకు మౌత్ టాక్ చాలు. కాని డిస్నీ వాళ్ళు మాత్రం సినిమాను గట్టిగా ప్రమోట్ చేయాలని డిసైడయ్యారు.
లేటెస్ట్ బిగ్ బాస్ ప్రోమోస్ నుండి ఇతర యుట్యూబ్ వీడియోల వరకు ఇప్పుడు డిస్నీ+హాట్ స్టార్ ఛానల్లో వచ్చే ప్రతీ వీడియోతోనూ భీమ్లా నాయక్ యాడ్ కనిపిస్తోంది. అంతే కాకుండా, యుట్యూబ్ యాడ్ పరంగా కూడా భీమ్లాను భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాతో తమ హైప్ ను కూడా బాగా పెంచుకోవాలని చూస్తున్న ఆహా కూడా, భీమ్లా నాయక్ ను తెగ ప్రమోట్ చేస్తోంది. అసలు సినిమా మీద ఎటువంటి ట్వీట్ వెయ్యకుండా కామ్ గా ఉన్న అల్లు అర్జున్ కూడా ఆహాలో భీమ్లా అంటూ ఓ రెండు ట్వీట్లేశాడు.
ఇకపోతే జనాలు కూడా ఆర్ఆర్ఆర్ టిక్కెట్లు దొరికినా దొరకకపోయినా కూడా భీమ్లా నాయక్ మాత్రం చూసేస్తున్నారట. అయితే ఆహాలో ఎక్కుమంది చూస్తున్నారా లేదంటే హాట్ స్టార్లో చూస్తున్నారో తెలియదు కాని, భీమ్లా నాయక్ మాత్రం ఏదో కొత్తగా ధియేటర్లో రిలీజ్ అవుతున్న సినిమా తరహాలో సందడి చేస్తోంది. ఇతర సినిమా ఇండస్ట్రీల్లో ఉన్న స్టార్లు కూడా ఇప్పుడు భీమ్లా చూసేసి ట్వీట్లు పెడుతున్నారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ సినిమా రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ మెరుపులు మెరిపిస్తోంది.
This post was last modified on March 26, 2022 5:09 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…