ట్రిపుల్ ఆర్ సినిమా విడుదయి మంచి టాక్ తెచ్చుకుంది కొన్ని చోట్ల.. కొన్ని చోట్ల మిశ్రమ స్పందన కూడా తెచ్చుకుంది. సినిమా అన్నది హిట్టా ఫట్టా అన్న చర్చలకు కూడా ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా ఆస్కారం ఇస్తూ వస్తోంది. తప్పు రాజమౌళిది అని కొందరు.. కథలోనే సత్తా లేదని ఇంకొందరు సినిమాపై పడి ఏడ్వకండి అని ఇంకొందరు తమ తమ వ్యాఖ్యలు జోడిస్తూ మాట్లాడుతూ వస్తున్నారు. అసలు బాహుబలి టీంలో ఎవ్వరూ కూడా పెద్దగా సినిమాకు సపోర్ట్ ఇవ్వలేదు. రానా మినహా ఎవ్వరూ అంతగా రియాక్ట్ కాలేదు. ముంబయి దారుల్లో రానా మాత్రం తన ఇంటికి ట్రిపుల్ ఆర్ టీం ను పిలిచి ఆతిథ్యం ఇచ్చారు.
ఆర్ విత్ ఆర్ఆర్ఆర్ అనే ప్రొగ్రాంను కండక్ట్ చేశారు. ఇది మినహా ప్రభాస్ కానీ అనుష్క కానీ ఇంకా వేరెవ్వరు కూడా ఈ సినిమా మాట్లాడలేదు. బాహుబలి నిర్మాత శోభు మాట్లాడినా కూడా అది కూడా వివాదమే అయింది. కాస్త రిలీఫ్ ఏంటంటే ఆయన మాటల్లో అర్థాలు విపరీతంగా ఉన్నా కూడా ఫ్యాన్స్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇకపై నాన్ ఆర్ఆర్ఆర్ పేరిట రికార్డులు నమోదు అవుతూ ఉంటాయని ఒకసారి, మరోసారి నాన్ ఎస్ఎస్ఆర్ పేరిట రికార్డులు నమోదు అవుతూ ఉంటాయని చెబుతూ శోభు చెప్పిన మాటలు కొన్ని క్షణాలు ట్విటర్ వాల్ ను షేక్ చేశాయి. తరువాత ఎందుకనో నెటిజన్లు సైలెంట్ అయిపోయారు.
ఇక తాజా వివాదంలో తారక్ ఇరుక్కున్నారు. ఈ సినిమాలో తారక్ కు పెద్దగా ప్రాధాన్యం లేదని ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. కానీ సినిమా సినిమాగానే చూడాలి అని ఇంకొందరు అంటున్నారు. మేకింగ్ పరంగా సినిమా బాగున్నా, మూడేళ్ల పాటు ఓ పెద్ద హీరో కాల్షీట్లు ఉంచేయడం బాలేదని కూడా తారక్ విషయమై రాజమౌళి చేసిన తప్పులను వెలుగులోకి తెస్తున్నారు. దీంతో రాజమౌళి వీటిపై స్పందించినా స్పందించకపోయినా వివాదం అయితే నడుస్తోంది.
మరో ఉపశమనం ఏంటంటే వీటిని పట్టించుకునే స్థితిలో తారక్ కానీ చరణ్ కానీ రాజమౌళి కానీ లేకపోవడం. ఇక సంవాదం ఏంటంటే లోకేశ్ ఈ సినిమా విషయమై నిన్నటి వేళ సానుకూల దృక్పథంతో ట్వీట్లు చేశారు. ఇవన్నీ టీడీపీ అభిమానులను ఆనందింపజేస్తున్నాయి. భీమ్లా నాయక్ విషయమై కూడా ఆయన ఈ విధంగా ట్వీట్లు చేశారు. ఆ రోజు చెప్పిన విధంగా తనకు సినిమా నచ్చితే ఆ సినిమా పై ఆసక్తి ఉంటే తప్పక మాట్లాడతానని అన్నారు. దీంతో చినబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తారక్ ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు.
This post was last modified on March 26, 2022 3:25 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…