ఆంధ్రప్రదేశ్‌లో మామూలుగానే పెద్ద సినిమాలు రిలీజైనపుడు బ్లాక్ టికెట్ల దందా బాగా నడుస్తుంటుంది. ఇక ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రం రిలీజవుతుంటే ఇక చెప్పేదేముంది? మామూలుగా అయితే థియేటర్ల వాళ్లు కొన్ని టికెట్లు బ్లాక్ చేసి పెట్టి.. వాటిని థియేటర్ సిబ్బందితోనే బయట ఎక్కువ రేటుకు అమ్మించడం జరుగుతుంటుంది. పోలీసులు చూసీ చూడనట్లు ఉంటుంటారు.
ఈ వ్యవహారమంతా కాస్త చాటుగానే ఉండేలా చూసుకుంటుంటారు. కానీ ఈ మధ్య ఏపీలో వ్యవహారం మారిపోయింది. టికెట్ల రేట్లు తగ్గించాక ఆన్ లైన్ అమ్మకాలు తగ్గించేసి కౌంటర్లోనే ఎక్కువ రేటు పెట్టి అమ్మడం జరుగుతోంది. థియేటర్ల వాళ్లు స్థానిక అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై ఎక్కువ రేటుకు టికెట్లను అమ్ముకుంటున్నారు. కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు.
పుష్ప సినిమాకు చాలా చోట్ల ప్రభుత్వం నిర్దేశించిన రేట్లను పక్కన పెట్టి ఫ్లాట్ రేటు 200-250 పెట్టి అమ్మకాలు సాగించడం గమనార్హం. ఇప్పుడిక ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చింది. దీనికున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టికెట్ల కోసం డిమాండ్ కూడా మామూలుగా లేదు. ఈ సినిమాకు టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. అయినా సరే.. చాలా థియేటర్లు ఆన్ లైన్‌కు రాలేదు. కౌంటర్ బుకింగ్స్‌కే పరిమితం అయ్యాయి.
ఆన్ లైన్లో టికెట్లు పెట్టినా అందుబాటులో ఉన్నవి తక్కువే. చాలా వరకు బ్లాక్ చేసేస్తున్నారు. చాలా థియేటర్లలో కౌంటర్ దగ్గరే రూ.300-400 మధ్య ఫ్లాట్ రేట్ పెట్టి అమ్మేస్తుండటం గమనార్హం. దీనికి తోడు బ్లాక్ టికెటింగ్ దందా వేరుగా నడుస్తోంది. డిమాండును బట్టి షోలు మొదలవడానికి ముందు 500-1000 మధ్య రేటుతో టికెట్లు అమ్మడం ఖాయంగా కనిపిస్తోంది. దీని గురించి ప్రశ్నించేవాళ్లు, ప్రశ్నించినా పట్టించుకునేవాళ్లు లేకపోవడంతో ప్రేక్షకుల జేబులకు భారీగా చిల్లు పడుతోంది. పేదల కోసం చౌకగా సినీ వినోదం అనే జగన్ సర్కారు మాటకు అసలు విలువే లేదన్నది గ్రౌండ్ రిపోర్ట్.
This post was last modified on March 24, 2022 11:31 am
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో గడ్డం,…
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…