సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అతను డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఐతే అతడి డిప్రెషన్‌కు కారణం బాలీవుడ్లో ఒక వర్గమే కారణమంటూ వాళ్లపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కరణ్ జోహార్ లాంటి వాళ్లను టార్గెట్ చేసి నెటిజన్లు తమ ఆగ్రహాన్ని చూపించారు. ఐతే కొన్ని రోజులు గడిచాక ఇప్పుడు టార్గెట్ మారింది. లెజెండరీ డైరెక్టర్ మహేష్ భట్ మీద ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలతో పాటు నెటిజన్లు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సుశాంత్‌ది అసలు ఆత్మహత్యే కాదంటూ ఇప్పుడు ఓ కొత్త కథనం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చనిపోయిన రోజు రాత్రి కొన్ని గంటల ముందు సుశాంత్ ఫ్లాట్‌కు స్నేహితులు వచ్చారని.. అందరూ కలిసి సరదాగా గడిపారని.. సుశాంత్ కొంత సమయం బయటికి కూడా వెళ్లి వచ్చాడని ఈ కథనంలో పేర్కొన్నారు.
సుశాంత్ డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకునే సంకేతాలు ఎంతమాత్రం ఆ సమయంలో లేవని.. ఉరితాడు మీద సుశాంత్ ఎడమ చేతి బొటన వేలు మినహా వేలి ముద్రలు లేవని.. అలాగే అతడి మాస్టర్ బెడ్ రూం డూప్లికేట్ కీ మిస్సయిందని.. ఇలా రకరకాల సందేహాలు ఆ కథనంలో కనిపించాయి. ఇదిలా ఉంటే సుశాంత్ మృతి వెనుక మహేష్ భట్ ఉన్నాడంటూ మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని కొన్ని నెలల్లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఐతే రియాతో మహేష్‌కు ఎఫైర్ ఉందని.. ఆమె నుంచి దూరంగా ఉండాలంటూ సుశాంత్‌ను హెచ్చరించాడని.. ఈ నేపథ్యంలో సుశాంత్ బలవన్మరణం వెనుక ఆయన ఉండొచ్చని ఒక ప్రచారం నడుస్తోంది. రియాతో మహేష్ చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. రియాను విచారించిన పోలీసులు.. మహేష్ పాత్ర మీదా విచారణ జరపాలని సుశాంత్ సన్నిహితులు డిమాండ్ చేస్తున్నారు. ఐతే ఈ ప్రచారాల్లో, ఆరోపణల్లో ఎంత వరకు నిజాలున్నాయన్నది పోలీసులే తేల్చాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates