‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారో లెక్కే లేదు. జనవరిలో సినిమా రిలీజ్ ఖరారైనపుడు దానికి నెల రోజుల ముందు పదుల సంఖ్యలో ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. అప్పుడంత కష్టపడీ ప్రయోజనం లేకపోయింది. సినిమా వాయిదా పడింది. ఇప్పుడు మార్చి 25న సినిమా రిలీజ్ ఓకే అయ్యాక గత కొన్ని వారాల నుంచి మళ్లీ ఉద్ధృతంగా ప్రమోషన్లు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇబ్బడిముబ్బడిగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో కొన్ని అత్యంత ఆసక్తికరంగా సాగాయి. సినిమా సంగతులతో పాటు వ్యక్తిగత విషయాలనూ పంచుకుంటూ ఈ ఇంటర్వ్యూలను రక్తి కట్టిస్తున్నారు తారక్, చరణ్, రాజమౌళి. ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూల్లో తారక్‌దే పైచేయిగా ఉంటోంది. అతను మామూలుగానే హైపర్ యాక్టివ్ కాబట్టి ఇంటర్వ్యూల్లో మిగతా ఇద్దరినీ బాగా డామినేట్ చేస్తున్నాడు.
తాజాగా నార్త్ ఆడియన్స్ కోసం నిర్వహించిన ఒక ఇంగ్లిష్ ఇంటర్వ్యూలో తారక్ ఒక ఆసక్తికర ప్రశ్నకు తనదైన శైలిలో బదులిచ్చాడు. ఒక దీవిలో మిమ్మల్ని పడేసి అక్కడికి ముగ్గురు వ్యక్తులనే వెంట తీసుకెళ్లాలని అంటే ఎవరిని ఎంచుకుంటారు అన్నది ప్రశ్న. దీనికి తారక్ జవాబిస్తూ.. తొలి వ్యక్తిగా రామ్ చరణ్ పేరు చెప్పాడు. అలాంటి ప్రదేశాలకు వెళ్లినపుడు మన వెంట అన్ని రకాలుగా బలవంతుడైన వ్యక్తి ఉండాలని, చరణ్ చాలా స్ట్రాంగ్ కాబట్టి అతణ్ని కచ్చితంగా తీసుకెళ్తానని అన్నాడు. ఆ సమయంలో వెంట ఉండదగ్గ మరో వ్యక్తిగా రానా దగ్గుబాటి పేరు చెప్పాడు తారక్.
మూడో వ్యక్తి రాజమౌళినా అని అడిగితే.. ఛాన్సే లేదన్నాడతను. రాజమౌళితో ఇలాంటి చోట్ల కష్టమని, కాబట్టి వెంట తీసుకెళ్లలేని చెప్పాడు. మూడో వ్యక్తిగా అతను ఎంచుకున్నది తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ కావడం విశేషం. అలాంటి సమయాల్లో సంగీతంతో మనల్ని ఎంటర్టైన్ చేసే వ్యక్తి చాలా అవసరమని, అందుకే అనిరుధ్‌ను ఎంచుకున్నట్లు చెప్పాడు. మరి వంట మనిషి అక్కర్లేదా అంటే, నేనే వంట చేస్తా కాబట్టి మళ్లీ చెఫ్ ఎందుకు అని ప్రశ్నించాడు తారక్.
This post was last modified on March 23, 2022 11:04 am
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…
తీవ్ర వివాదాలు ఎదురుకుంటూ విపరీతమైన వాయిదాలకు లోనవుతూ వచ్చిన ఎమర్జెన్సీ ఇటీవలే విడుదలయ్యింది. క్రిష్ వదిలేశాక మణికర్ణిక బ్యాలన్స్ పూర్తి…
కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కొవిడ్ టైంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డాక..…
ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి ఫౌజీ టైటిల్…
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాలకు కాస్తంత గ్యాప్ ఇచ్చినట్టే కనిపిస్తున్నారు. ఈ సంక్రాంతికి డాకు…