కన్నడ సినిమా చరిత్రలో రాజ్ కుమార్‌కు సాటి వచ్చే నటుడు, హీరో ఇంకొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఆయన మీద కన్నడిగుల ప్రేమ కూడా అలాంటిలాంటిది కాదు. కోట్లాది మందికి ఆయన దైవ సమానుడు. ఆయన కుటుంబం మీద కన్నడిగులు చూపించే వాత్సల్యం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. రాజ్ కుమార్ నట వారసులు శివరాజ్ కుమార్, పునీత్ రాజ్‌కుమార్‌ల మీద కూడా అంతే ప్రేమను కనబరుస్తుంటారు కన్నడ ప్రేక్షకులు.
వాళ్లు అంతగా ఇష్టపడే హీరోల్లో ఒకరు ఈ మధ్యే హఠాత్తుగా కన్ను మూయడం తెలిసిందే. కొన్ని నెలల కిందట పునీత్ రాజ్ కుమార్ మరణం కన్నడిగులను శోకసంద్రంలో ముంచెత్తింది. దాని తాలూకు బాధ నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నారు అభిమానులు. ఇలాంటి టైంలో పునీత్ పుట్టిన రోజు వచ్చింది. ఆ సందర్భంగా అతడి చివరి సినిమా ‘జేమ్స్’ రిలీజైంది. దీంతో అతడిపై తమకున్న ప్రేమను మరోసారి చాటి చెప్పారు కన్నడిగులు. కర్ణాటకలో మెజారిటీ స్క్రీన్లలో ‘జేమ్స్’ను ప్రదర్శించడం.. రిలీజ్ రోజు రాష్ట్రమంతా పునీత్ నామస్మరణతో మార్మోగిపోవడం తెలిసిందే.
థియేటర్ల దగ్గర మునుపెన్నడూ చూడని వాతావరణం కనిపించింది. పునీత్ చివరి సినిమాను మామూలుగా సెలబ్రేట్ చేయలేదు కన్నడ ప్రేక్షకులు. ఈ చిత్రానికి కర్ణాటక సినీ చరిత్రలోనే ఎన్నడూ లేని వసూళ్లను కట్టబెట్టారు. తొలి రోజు అప్పటిదాకా వసూల్ల రికార్డులన్నింటినీ ఇది బద్దలు కొట్టేసింది. ఆ తర్వాత కూడా ప్రభంజనం కొనసాగించింది. నాలుగు రోజుల్లోనే ‘జేమ్స్’ రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది.
కన్నడ సినిమా చరిత్రలో ఇంత వేగంగా రూ.100 కోట్ల మార్కును అందుకున్న సినిమా ఏదీ లేదు. ‘కేజీఎఫ్’ లాంటి సంచలన చిత్రం కూడా ఇంత వేగంగా వంద కోట్ల మార్కును అందుకోలేదు. అసలు కన్నడ సినిమాలకు కన్నడనాట వంద కోట్ల వసూళ్లు రావడమే అరుదు. అలాంటిది ఇంత వేగంగా ఈ రికార్డు సాధించడం గొప్ప ఘనత. 80 ఏళ్ల కన్నడ సినిమా చరిత్రలో రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్న జేమ్స్.. పునీత్‌పై కన్నడిగుల ప్రేమకు నిదర్శనంగా నిలుస్తోందని పోస్టర్లు వదులుతున్నారు మేకర్స్
This post was last modified on March 22, 2022 7:06 pm
సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో మొదటి రోజు ఆట ఉత్కంఠగా ముగిసింది. ఆసీస్ జట్టు…
అనంతపురంలో రాజకీయ రచ్చ రేగింది. కూటమి పార్టీల నేతల మధ్య మాటల మంటలు రేగాయి. ము ఖ్యంగా మాజీ ఎమ్మెల్యే…
గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ పోషిస్తున్న అప్పన్న పాత్ర మీద ట్రైలర్ లో పలు క్లూలు ఇచ్చారు కానీ…
సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో మొదటి రోజు ఆట ఉత్కంఠగా ముగిసింది. ఆసీస్ జట్టు…
బాలకృష్ణ - బాబీ కాంబోలో రూపొందిన డాకు మహారాజ్ మీద అభిమానుల ఆశలు ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తున్నాం. తమన్…
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో శ్రీలీల ప్లేస్ ఏంటో చెప్పనక్కర్లేదు. గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టినా పుష్ప…