ఇండియన్ బాక్సాఫీస్ రికార్డుల వేటకు ఓ భారీ చిత్రం సిద్ధమైంది. ఐదేళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న బాహుబలి రికార్డులను బద్దలు కొట్టడానికి మళ్లీ రాజమౌళే వస్తున్నాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త చిత్రం ఆర్ఆర్ఆర్ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై ఉన్న అంచనాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలిని మించిన బడ్జెట్, అంతకుమించి బిజినెస్ చేసుకున్న ఈ చిత్రం.. వసూళ్ల పరంగా కూడా ఆ సినిమాను అధిగమిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
మిగతా ప్రాంతాల సంగతేమో కానీ.. తెలుగు రాష్ట్రాల వరకైతే కొత్త రికార్డులు నమోదు కావడం లాంఛనం లాగే కనిపిస్తోంది. ఐదేళ్ల కిందటితో పోలిస్తే టికెట్ల ధరలు బాగా పెరగడం ఆర్ఆర్ఆర్‌కు కలిసొచ్చే అంశం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఆర్ఆర్ఆర్ టార్గెట్ రూ.200 కోట్లు కావడం గమనార్హం. ఐదేళ్ల ముందు బాహుబలి-2కు నైజాం హక్కులు దాదాపు రూ.50 కోట్లు పలికితే ఔరా అనుకున్నారు.
అలాంటిది ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నైజాం హక్కులను రూ.70 కోట్లకు అమ్మారు. కరోనా దెబ్బ లేకుంటే ఇంకా రేటు పెరిగేదేమో. ఆంధ్రా ప్రాంత హక్కులు ఏకంగా రూ.95 కోట్లు పలికాయి. సీడెడ్ రైట్స్ రూ.35 కోట్లకు ఇచ్చారు. మారు బేరాలకు అమ్మిన రేట్ల ప్రకారం చూస్తే ఇంకా ఎక్కువ బిజినెస్ జరిగినట్లే. నైజాంలో టికెట్ల ధరలు మామూలుగానే ఎక్కువగా ఉంటే, ఆర్ఆర్ఆర్‌కు మరింతగా రేట్లు పెరిగాయి.
దీంతో వీకెండ్లోనే ఈ చిత్రం 60 కోట్లకు తక్కువ కాకుండా షేర్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. తొలి రోజు అలవోకగా పాతిక కోట్ల షేర్ కొట్టేలా కనిపిస్తోంది. తెలంగాణ స్థాయిలో కాకపోయినా ఆంధ్రాలో కూడా రేట్లు బాగానే పెరిగాయి కాబట్టి అక్కడా వసూళ్ల మోత మోగబోతున్నట్లే. కొత్త రికార్డులు నమోదు కానున్నట్లే. సినిమా మరీ పేలవంగా ఉంటే తప్ప ఈ చిత్రం రూ.200 కోట్ల షేర్ మార్కును టచ్ చేసి సరికొత్త రికార్డుకు శ్రీకారం చుట్టబోతుండటం ఖాయం.
This post was last modified on March 21, 2022 4:18 pm
మాములుగా స్టార్ హీరోల విషయంలో కంబ్యాక్, సెకండ్ ఇన్నింగ్స్ పదాలు సాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు లేదా…
బాక్సాఫీస్ కు ఈ ఏడాది సంక్రాంతి, ఉగాది తర్వాత అత్యంత కీలకమైన సీజన్ ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం. లాంగ్…
నితిన్ లేటెస్ట్ రిలీజ్ రాబిన్ హుడ్ బాక్సాఫీస్ ఫలితం చేదుగా వచ్చేసింది. ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేసినా, డేవిడ్ వార్నర్…
టాలీవుడ్ శ్రీవల్లిగా అభిమానులను సంపాదించుకున్న రష్మిక మందన్న మూడు బ్లాక్ బస్టర్లు యానిమల్, పుష్ప 2 ది రూల్, ఛావాలతో…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం సాగర నగరం విశాఖపట్టణం…
ఏపీ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విశాఖపట్టణం… గతంలో ఎలా ఉందో, భవిష్యత్తులోనూ అలాగే ఉండనుంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం…