గాన గంధర్వరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి ఏడాదిన్నర కావస్తోంది. బాలును అమితంగా ఇష్టపడే అభిమానులు ఆయన లేని విషయాన్ని జీర్ణించుకుని ముందుకు సాగడానికి చాలా సమయమే పట్టింది. కానీ ఇప్పుడు కూడా బాలును తలుచుకుంటే ఒక రకమైన బాధ అభిమానులను వెంటాడుతుంది.
అభిమానులకు. ఆయన పాట విన్నా.. మాట విన్నా.. ఆయన గురించి ఎవరైనా మాట్లాడింది విన్నా.. భావోద్వేగం కట్టలు తెంచుకుంటుంది. బాలు లాంటి గాయకుడు మరొకరు లేరు అనడానికి ఎన్నో రుజువులున్నాయి. అలాంటిదే సంగీత దర్శకుడు కీరవాణి ఇప్పుడో విషయాన్ని పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో భాగంగా హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి ఒక చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్న కీరవాణి.. మధ్యలో బాలు ప్రస్తావన వచ్చినపుడు ఆయన గొప్పదనాన్ని చాటే ఓ సీక్రెట్‌ను బయటపెట్టారు.
రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రంలో ఒకప్పటి చిరు సినిమా ఘరానా మొగుడులోని బంగారు కోడి పెట్ట పాటను రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాట ఆరంభంలో అప్ అప్ హ్యాండ్సప్ అనే పంక్తులు వస్తాయన్న సంగతి తెలిసిందే. బాలు ఫుల్ ఎనర్జీతో, హై పిచ్‌లో పాడారు ఆ లైన్లను. ఐతే ఈ పాటను రీమిక్స్ చేయాలనుకున్నపుడు ఈ పాట పాడిన సింగర్‌తో ఆ లైన్లు పాడించాలని చూస్తే తన వల్ల కాలేదట.
ఆ లైన్ల వరకు వేరే సింగర్లను కూడా ప్రయత్నించగా.. ఎవరూ బాలును మ్యాచ్ చేసే స్థాయిలో ఆ లైన్లను అందుకోలేకపోయారట. దీంతో ఇక లాభం లేదని ఒరిజినల్ పాటలోని బాలు పాడిన ట్రాక్‌నే తీసుకుని ఆ లైన్ల వరకు కొత్త పాటలో కలిపేసినట్లు కీరవాణి వెల్లడించారు. తర్వాత ఈ పాట విని.. ఇదేంటి తన గొంతు లాగే ఉందని బాలు కీరవాణితో అన్నారట. అవును.. మీ గొంతేనని.. మీకు చెప్పకుండా అలాగే పెట్టేశాం అని వివరణ ఇచ్చుకున్నట్లు కీరవాణి వెల్లడించారు. ఈ వీడియో చూసి అభిమానులు బాలుకు బాలునే సాటి అంటూ ఎమోషనల్ అవుతున్నారు.
This post was last modified on March 21, 2022 9:47 am
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…